Crew Movie Collection: సర్‌ప్రైజ్ చేస్తున్న కరీనా, టబు 'క్రూ' మూవీ వసూళ్లు - నాలుగు రోజుల్లోనే అన్ని కోట్లు రాబట్టిందా!
Crew Movie: 'క్రూ' మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఊహించని విధంగా కలెక్షన్స్ రాబడుతూ మేకర్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. స్టార్ హీరో సినిమా రేంజ్‌లో ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతూ షాకిస్తుంది.
Crew Movie Collections: బాలీవుడ్‌లో రీసెంట్‌గా తెరకెక్కిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా 'క్రూ'. సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్ యంగ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29 థియేటర్లో విడుదలైంది. డైరెక్టర్ రాజేష్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఎలాంటి అంచానలు లేకుండ వచ్చిన ఈ చిత్రం స్టార్ హీరో సినిమాల రేంజ్‌లో వసూళ్లు చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 70.73పైగా కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది.
ఇక 'క్రూ' మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ సైతం సర్‌ప్రైజ్ అవుతున్నారు. నిజానికి రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, టబు, కరీనా, కృతిలు తమదైన నటన, కామెడీతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు.దాంతో రోజురోజుకు మూవీ ఆదరణ పెరిగిపోతుంది. జస్ట్ మౌత్ టాక్‌తోనే ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుందట. వీకెండ్‌లోనే కాదు వీక్ డేస్‌లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అదే జోరు చూపిస్తుంది. కాగా బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్యానర్స్ పై ఏక్తాకపూర్, అనిల్ కపూరు, శోభా కపూర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇందులో కరీనా కపూర్, టబులతో పాటు దిల్జిత్ దోసంజ్, కపిల్ శర్మ లు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదలకు ముందు ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ విడుదల చేసిన సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో టబు, కరీనా, కృతి ఎయిర్ హోస్టెస్ రోల్స్ చేశారు. ఎయిర్‌పోర్టులో హెయిర్ హోస్టెస్ అయిన ఈ ముగ్గురికి ముగ్గురికీ ఒకరోజు తనిఖీలో భారీగా బంగారం దొరుకుతుంది. జీతాలు టైంకి రాక, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆ బంగారం తీసుకుంటారు. గోల్డ్ కోసం కస్టమ్స్ వాళ్ళు ఎంక్వయిరీ చేయగా తెలిసింది ఏంటి? చివరకు ఏమైంది? అనేది ఈ సినిమా. ఈ క్రమంలో ఈ ముగ్గురు దాని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నం ఫుల్ ఫన్‌గా సాగుతుందట. ముఖ్యంగా కరీనా కపూర్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుందట. వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి ఆడియన్స్ అంతా థియేటర్లో పడి పడి నవ్వుకంటారట.
Crew Movie Review In Telugu:ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు బాలీవుడ్ క్రిటిక్, రివ్యూవర్ ఉమైర్ సంధు సినిమాపై తన రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ విషయంలో అయినా నెగిటివ్‌గా స్పందించే ఉమైర్ సంధు ఫస్ట టైం 'క్రూ' సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇవ్వడం విశేషం. దీంతో ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ కూడా సినిమాకు ప్లస్ అయ్యిందనిపిస్తుంది. థియేటర్లలో సర్‌ప్రైజ్ అయ్యేందుకు ప్రేక్షకుల్ని రెడీ అవ్వమని, 'క్రూ' సినిమాలో హ్యూమర్ బాగా వర్కవుట్ అయ్యిందని, సంభాషణలు / వన్ లైన్ పంచ్ డైలాగులు నవ్విచడంతో పాటు షాక్ ఇస్తాయని చెప్పుకొచ్చాడు. గాళ్ గ్యాంగ్ నిజంగా బిందాస్ అని పేర్కొన్నాడు. కరీనా కపూర్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రశంసలు కురిపించాడు ఉమైర్ సంధు.
Also Read: 'వార్ 2' కోసం స్పెషల్ కోర్స్‌లో జాయిన్ కాబోతున్న ఎన్టీఆర్? - రెండు వారాల్లో పూర్తిగా మేకోవర్..!