Jr NTR War 2: 'వార్ 2' కోసం స్పెషల్ కోర్స్‌లో జాయిన్ కాబోతున్న ఎన్టీఆర్? - రెండు వారాల్లో పూర్తిగా మేకోవర్..!
JR NTR: 'వార్ 2' సెట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది.
Jr NTR to Be Joins in Fitness Course For 2 Weeks For War 2: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత తారక్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటుంది. ఇటీవల గోవా షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు తారక్ 'వార్ 2'సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇందులో తారక్ బాలీవుడ్ హ్యాండ్స్‌మ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో హిందీ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు జూనియర్.
'వార్ 2' కోసం తారక్ స్పెషల్ కోర్స్
ఇది తారక్ తొలి హిందీ చిత్రం కావడంతో 'వార్ 2'పై ఇటూ బి-టౌన్ ఆడియన్స్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక తారక్ ఈ మూవీ సెట్‌లో ఎప్పుడెప్పుడు అడుగుపెడుతాడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు కోసం ఎన్టీఆర్ మేకోవర్ అవబోతున్నాడట. తన పాత్రలో భాగంగా ఎన్టీఆర్ ఫుల్ ఫిట్‌నెస్‌గా కనించాల్సి ఉందట. ఇందుకోసం తారక్ ఫిట్‌నెస్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణుడి దగ్గర తారక్ స్పెషల్‌గా శిక్షణ తీసుకుంటున్నాడు. రెండు వారాల పాటు ఫిట్‌నెస్ కోర్స్‌లో యంగ్ టైగర్ బిజీగా ఉండబోతున్నట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్.
దీని తర్వాత ఎన్టీఆర్ 'వార్ 2'లో ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దిగబోతున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే YRF స్పై యూనివర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ని సిద్ధార్థ్ ఆనంద్ దాని సీక్వెల్‌గా వస్తున్న 'వార్ 2'ను తెరకెక్కించే బాధ్యతను అయాన్ ముఖర్జీ తీసుకోవడం గమనార్హం. కాగా ఈ సినిమాను 2025 ఆగస్ట్ 14వ విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. చెప్పిన తేదీకే మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ టీం శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకునేందు ఆ దిశ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సెట్‌లో అడుగుపెట్టిన హృతిక్ రోషన్ స్పెయిన్‌లో జరిగిన పలు యాక్షన్ సీన్స్‌లో గాయపడ్డాడు. గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి మోడ్‌లో హృతిక్ త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టబోతున్నాడు.
ఎన్టీఆర్ పాత్ర అలా ఉంటుందా?
ఆ వెంటనే ఎన్టీఆర్ కూడా మేకోవర్ అయ్యి షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇక వార్ 2 కోసం హృతిక్ రోషన్ డైరెక్టర్‌కు 100 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడని, ఇందులో ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయని బి-టౌన్‌లో టాక్. ఇదిలా ఉంటే 'వార్ 2' ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఇందులో హృతిక్ రోషన్‌తో పాటు తారక్ కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందట. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఇందులో గుఢాచారిగా కనిపించనున్నాడని సినీ సర్కిల్లో టాక్. హృతిక్‌లాగే ఎన్‌టీఆర్ కూడా ఈ మూవీ కోసం 100 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇటూ దేవరతో పాటు వార్ 2 షూటింగ్ ఒకేసారి చేస్తాడని తెలుస్తుంది.