Karavali Teaser: కుర్చీ అంటే వణుకు పుట్టాల్సిందే... కన్నడ మూవీ 'కరావళి' టీజర్ చూశారా?
Karavali Teaser: సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రజ్వల్ హీరోగా నటించిన సినిమా 'కరావళి'. తాజాగా టీజర్ విడుదల చేశారు. సూపర్ నేచురల్ కథతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చూస్తే కుర్చీలో కూర్చోవాలంటే భయపడాలి
ప్రస్తుతం ప్రేక్షకులు రొటీన్ కథలను ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ట్రెండ్ కు తగ్గట్టుగా కొత్త కొత్త కథలతో పలకరించే సినిమాల పైనే ఆసక్తిని చూపిస్తున్నారు. స్టోరీ ఏమాత్రం రొటీన్ గా ఉన్నా సరే, థియేటర్లకు వెళ్లకుండానే వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది ఇలాంటి రొటీన్ రొట్ట కొట్టుడు కథలతో వచ్చి, బాక్స్ ఆఫీసు వద్ద బొక్క బోర్లా పడ్డ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే న్యూ ఇయర్ సందర్భంగా తమ కంటెంట్ తో ప్రేక్షకుల మన్ననలు పొందుతానే గట్టి నమ్మకంతో కొత్త సినిమాల అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఆ అప్డేట్స్ అన్నింట్లోనూ 'కరావళి' టీజర్ గురించి చర్చ నడుస్తోంది.
కుర్చీ అంటే వణుకు పుట్టాల్సిందే
ప్రేక్షకుల అభిరుచి మారడంతో ప్రస్తుతం మేకర్స్ కూడా కొత్త కొత్త కంటెంట్ తో తెరపై ప్రయత్నాలు చేయడానికి ధైర్యం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి కొత్త కథలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కరావళి' అనే సినిమా టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు కన్నడ మేకర్స్. 'అంబి నింగే వయసైతో' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ గురుదత్త గనిగ. ఇక కన్నడ ఇండస్ట్రీలో డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తాజా మూవీనే 'కరావళి'. ఈ సినిమాలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుంటే, సంపద, మిత్ర ముఖ్యపాత్రలో పోషించారు.
ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందించారు. వీకే ఫిలిమ్స్ బ్యానర్, గురుదత్త గనిగా ఫిలిం బ్యానర్ లపై గురుదత్త గనిగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనే దర్శకుడుగా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ప్రోమోను ఇదివరకే మేకర్స్ రిలీజ్ చేసి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. మెస్మరైజ్ చేసే కంటెంట్, కాన్సెప్ట్ తో వస్తున్నారు అనే ఫీలింగ్ తెప్పించిన ఈ టీజర్ ను చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.
Also Read: 'అన్‌స్టాపబుల్ 4' షో కోసం రామ్ చరణ్ వేసుకున్న హుడీ కాస్ట్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
టీజర్ లో హైలెట్స్ ఇవే
ఇక టీజర్ విషయానికి వస్తే... మహిషాసురలకు, మానవులకు మధ్య జరిగే యుద్ధం కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కినట్టు అన్పిస్తోంది. "పిశాచి రాక" అంటూ వదిలిన ఈ టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాదు అద్భుతమైన విజువల్స్, ఆర్ఆర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ టీజర్ ని చూశాక కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ రాబోతోంది అని ఆడియన్స్ ఫిక్స్ అవ్వడం ఖాయం. ఇక టీజర్ లో కుర్చీ మెయిన్ హైలెట్ గా నిలిచింది. అలాగే గేదెల చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ ని చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఆ కుర్చీ మామూలు కుర్చీ కాదని, అదొక పిశాచి అని తెలుస్తోంది. మొత్తానికి కొత్త కథతో హారర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ 'కరావళి' టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. మరి ఈ సినిమాను కేవలం కన్నడలోనే రిలీజ్ చేస్తారా? లేదంటే తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి.
Read Also : SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!