అన్వేషించండి

Kill Remake: తెలుగులోకి ‘కిల్‌’ మూవీ రీమేక్? అసలు సంగతి చెప్పేసిన మేకర్స్ - గాలి తీసేశారుగా!

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘కిల్‘ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Dharma Productions On ‘Kill’ Remake: లక్ష్య లాల్వానీ హీరోగా, నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘కిల్‘. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ చిత్రంలో తాన్యా మనక్తిలా హీరోయిన్ గా నటించింది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. ఈ మూవీలోని పలు సీక్వెన్స్ లు ఆడియెన్స్‌ను ఓ రేంజిలో అలరించాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హాలీవుడ్ రీమేక్ రైట్స్ ను ఇంగ్లీష్ దర్శకుడు ఛార్లెస్ ఎఫ్ స్టా హెల్స్కీ కొనుగోలు చేశారు. ఈ చిత్రాన్ని ఆయన హాలీవుడ్ లో ఏ రేంజిలో తెరకెక్కిస్తారోనని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.

రీమేక్ రైట్స్ పై ధర్మ ప్రొడక్షన్స్ క్లారిటీ

ఇక ‘కిల్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ క్లారిటీ ఇచ్చింది. హాలీవుడ్‌లో మాత్రమే రీమేక్ చేసేందుకే రైట్స్ అమ్మినట్లు తెలిపింది. భారత్‌లో ఇంకా రీమేక్ రైట్స్ అమ్మలేదని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇరత భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ధర్మ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dharma Productions (@dharmamovies)

ఇక ‘కిల్’ సినిమా గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాకు న్యాయ నిర్ణేతలు ఫిదా అయ్యారు. ఈ మూవీ ‘పీపుల్ ఛాయిస్ అవార్డు కేటగిరీలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఈ ఏడాది జూన్‌లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. అక్కడ కూడా మంచి ప్రశంసలు దక్కాయి. అదే వేడుకలో ఈ చిత్రాన్ని చూసి.. హాలీవుడ్ దర్శకుడు ఛార్లెస్‌ ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమాను ఇంగ్లీష్‌లో రీమేక్ చేయడానికి రైట్స్ తీసుకున్నారు. 

‘కిల్’ తెలుగులో రీమేక్ అంటూ వార్తలు

అటు ‘కిల్’ సినిమాకు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం తెలుగులోనూ రీమేక్ అవుతుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు నటిస్తున్నారని, వారిలో ఒకరు సుధీర్ బాబు, మరొకరు కిరణ్ అబ్బవరం అని ప్రచారం జరిగింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం వారిద్దరు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో టచ్ లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన ప్రకటనతో ఆ వార్తలన్నీ అవాస్తవం అని తేలిపోయింది. 

Read Also: ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా- విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: రుణమాఫీ కాని రైతులకు గుడ్‌ న్యూస్- ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు
రుణమాఫీ కాని రైతులకు గుడ్‌ న్యూస్- ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు
Anantha babu: ఏలేరు కాలువలో దొరికిన ఓ యువతి మృతదేహంతో అనంతబాబుకు లింక్‌- టీడీపీ ఎమ్మెల్యే శిరీష్ సంచలన ఆరోపణలు
ఏలేరు కాలువలో దొరికిన ఓ యువతి మృతదేహంతో అనంతబాబుకు లింక్‌- టీడీపీ ఎమ్మెల్యే శిరీష సంచలన ఆరోపణలు
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ ఎఫెక్ట్‌- ఈ జిల్లాలకు స్పెషల్‌ అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ ఎఫెక్ట్‌- ఈ జిల్లాలకు స్పెషల్‌ అలర్ట్ జారీ
JAC Of Telangana Employees: తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- చైర్మన్ ఎవరంటే ?
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- చైర్మన్ ఎవరంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Suryakumar Yadav Leaving MI Fact Check | KKR కి కెప్టెన్ గా SKY వెళ్తున్నాడా..? | ABP DesamVirat Kohli Jersey Auction | విరాట్ కొహ్లీకి ఓ రేట్ కట్టిన అభిమానులు | ABP DesamNeeraj Chopra Diamond League 2024 | నీరజ్ చోప్రా విజయం వెనుక ఓ కెన్యా ప్లేయర్ | ABP DesamShikhar Dhawan Announces Retirement | క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: రుణమాఫీ కాని రైతులకు గుడ్‌ న్యూస్- ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు
రుణమాఫీ కాని రైతులకు గుడ్‌ న్యూస్- ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు
Anantha babu: ఏలేరు కాలువలో దొరికిన ఓ యువతి మృతదేహంతో అనంతబాబుకు లింక్‌- టీడీపీ ఎమ్మెల్యే శిరీష్ సంచలన ఆరోపణలు
ఏలేరు కాలువలో దొరికిన ఓ యువతి మృతదేహంతో అనంతబాబుకు లింక్‌- టీడీపీ ఎమ్మెల్యే శిరీష సంచలన ఆరోపణలు
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ ఎఫెక్ట్‌- ఈ జిల్లాలకు స్పెషల్‌ అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ ఎఫెక్ట్‌- ఈ జిల్లాలకు స్పెషల్‌ అలర్ట్ జారీ
JAC Of Telangana Employees: తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- చైర్మన్ ఎవరంటే ?
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు- చైర్మన్ ఎవరంటే ?
AP IAS Posting: ఏపీలో 8 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌, సీఎస్ ఉత్తర్వులు
ఏపీలో 8 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌, సీఎస్ ఉత్తర్వులు
Asaduddin Owaisi: ప్రభుత్వ ఆఫీసులు కూడా కూల్చేస్తారా? హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ ఒవైసీ
FTL పరధిలోని ప్రభుత్వ ఆఫీసులు కూడా కూల్చేస్తారా? హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ ఒవైసీ
Babu Mohan: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన బాబూమోహన్ - పార్టీలో చేరతారా?
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన బాబూమోహన్ - పార్టీలో చేరతారా?
N Convention Demolition: నాగార్జున మంచి నటుడే, కానీ కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
నాగార్జున మంచి నటుడే, కానీ కక్కుర్తి ఎందుకు? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నారాయణ ఘాటు వ్యాఖ్యలు
Embed widget