అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా దేశం విడిచి వెళ్లేలా చేసింది, కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

సినిమా పరిశ్రమలో తనకు అవకాశాలు రాకుండా కొంతమంది కుట్రలు చేశారని నటి కంగనా రౌత్ ఆరోపించింది. వారి టార్చర్ తట్టుకోలేక దేశం విడిచి వెళ్లాలనుకున్నట్లు వెల్లడించింది.

Kangana Ranaut About Bollywood Mafia: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్ తన కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కీలక విషయాలు వెల్లడించింది. కొంతమంది తనకు కావాలని అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించింది. దేశం వెళ్లిపోయేలా కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.     

దశాబ్దం పాటు అవకాశాలు లేకుండా చేశారు- కంగనా

బాలీవుడ్ మాఫియా కుట్రలను తట్టుకోలేక దేశం విడిచి వెళ్లి పోవాలనుకున్నట్లు కంగనా వెల్లడించింది. “సినిమా పరిశ్రమ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం ఉండేది. ఎప్పటికైనా మంచి హీరోయిన్ కావాలి అనుకునేదాన్ని. అదే ఆశతో 2004లో ముంబైకి వచ్చాను. 2005-06లో ‘గ్యాంగ్ స్టర్’, ‘వోహ లమ్హే’ సినిమాల్లో నటించాను. రెండు సినిమాల్లోనూ మంచి క్యారెక్టర్లు చేశాను. నా యాక్టింగ్ కు చాలా మంది నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు లేవు. ఒకటి రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాలు అవకాశాలు రాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఛాన్సులు దొరకలేదు. నాకు ఆఫర్లు రాకపోవడానికి కారణం బాలీవుడ్ మాఫియా అని అర్థం అయ్యింది. ఛాన్సులు రాకుండా చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. ఒకానొక సమయంలో దేశం నన్ను బహిష్కరించినట్లు అనిపించింది. విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నాను” అని వెల్లడించింది.

అమెరికాకు వెళ్లి షార్ట్ ఫిల్మ్ తీశా- కంగనా

బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లిపోయినట్లు కంగనా వెల్లడించింది. “ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వెళ్లాను. కాలాబాసాస్‌ లో ఓ ఇంటిని కొన్నాను. ఓ ఏజెంట్ ను ఏర్పాటు చేసుకున్నాను. అతడితో కలిసి ఓ షార్ట్ ఫిలిమ్ చిత్రీకరించాను. చాలాసార్లు బాలీవుడ్ మాఫియా గురించి ఆలోచించాను. ఎందుకు తనలాంటి వారికి అవకాశాలు రాకుండా చేశారో అర్థం కాలేదు. కానీ, 2014లో విడుదలైన ‘క్వీన్’ సినిమా నా కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పింది” అని కంగనా చెప్పుకొచ్చింది. 

డైరెక్టర్ గా ఉండటమే చాలా ఇష్టం- కంగనా

ఇక నటిగా చేయడం కంటే దర్శకురాలిగా ఉండటమే చాలా ఇష్టమని కంగనా చెప్పుకొచ్చింది. “నాకు యాక్టింగ్ చేయడం అనేది చాలా ఈజీ పని. కానీ, నటిగా చేయడం పెద్దగా ఇష్టంలేదు. దానికి కారణలు ఉన్నాయి. నటిగా ఉంటే సెట్స్ లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు. అదే డైరెక్టర్ గా ఉంటే పూర్తి విషయాలు తెలుస్తాయి. అంతేకాదు, సెట్స్ లో డైరెక్టర్ కు ఎక్కువ గౌరవం ఉంటుంది. నేనూ సెట్స్ లో నటీనటులను గౌరవంగా చూసుకుంటాను. వారికి ఇబ్బంది కలగకుండా ముందుగానే అన్ని విషయాలు చెప్పేస్తాను” అని కంగనా వెల్లడించింది.

‘ఎమర్జెన్సీ’ మూవీలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇందిరా హయాంలో విధించిన ఎమర్జెన్సీ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

Read Also: మరో క్రేజీ మూవీకి కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్, దర్శకుడు ఆ క్రేజీ డైరెక్టర్ శిష్యుడేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కీపర్ బ్యాటర్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget