అన్వేషించండి

Indian 2 OTT: ఓటీటీలోకి ‘భారతీయుడు 2’ - అనుకున్న టైమ్‌కు విడుదలవుతుందా? లేదా?

కమల్ హాసన్ రీసెంట్ మూవీ ‘భారతీయుడు 2’ ఓటీవీ విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఆగస్టు 9న రిలీజ్ కావాల్సి ఉన్నా, విడుదల అవుతుందో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది.

Indian 2 OTT Relese: విశ్వ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘భారతీయుడు 2‘. జులై 12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. కనీసం పెట్టిన బడ్జెట్ కూడా రాక, నిర్మాతలు దారుణంగా నష్టపోయారు. థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. ఆగష్టు 9న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. పలు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

‘భారతీయుడు 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు?

‘భారతీయుడు 2‘ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి కొనుగోలు చేసింది. సుమారు రూ.120 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో ఓటీటీ సంస్థ పునరాలోచనలో పడింది. అంత మొత్తం చెల్లించే పరిస్థితి లేదని నిర్మాణ సంస్థకు చెప్పిందట నెట్ ఫ్లిక్స్. లైకా ప్రొడక్షన్ సంస్థతో జరిగిన చర్చల్లో చివరకు రూ.60 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ఇంతకీ, ఆగష్టు 9న విడుదల అవుతుందా? లేదా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘భారతీయుడు 2’లో కనిపించని శంకర్ మార్క్

1996లో కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన ‘భారతీయుడు‘ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘భారతీయుడు 2‘ వచ్చింది. ఇందులో కమల్‌ హాసన్‌ తో పాటు సిద్ధార్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా SJ సూర్య, సముద్రఖని కీలక పాత్రలలో నటించారు. సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు నెలకొన్నా, థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో అసలు శంకర్ మార్క్ డైరెక్షన్ ఎక్కడా కనిపించలేదనే టాక్ వినిపించింది. ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

‘థగ్ లైఫ్’ షూటింగ్ లో కమల్ హాసన్ బిజీ

అటు ప్రస్తుతం కమల్ హాసన్ ‘థగ్ లైఫ్‘ అనే సినిమా చేస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ కెరీర్ లో 234వ సినిమాగా ‘థగ్ లైఫ్’ రూపొందుతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టైటిల్ గ్లింప్స్, కమల్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం  అందిస్తున్నారు.

Read Also: హైదరాబాద్ మెట్రోలో రవితేజ సర్ ప్రైజ్.. ఐడియా అదిరింది 'మిస్టర్ బచ్చన్'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget