అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bharateeyudu 2: యస్కిన్‌తో సేనాపతి పోరాటం - ‘భారతీయుడు 2’కు గండంగా మారిన ‘కల్కీ 2898 ఏడీ’, పాన్ ఇండియా హిట్ డౌటేనా?

Indian 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'ఇండియన్ 2' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మరో పది రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది.

Kamal Haasan's Bharateeyudu 2: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2'. అగ్ర దర్శకుడు శంకర్ షణ్ముగం తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ.. 'భారతీయుడు 2' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది 1996లో సంచలన విజయం సాధించిన 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ చిత్రాన్ని జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసారు. దీనికి తగ్గట్టుగానే జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు ‘కల్కీ 2898 ఏడీ’ కారణంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. గత గురువారం గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. 5 రోజుల్లోనే రూ. 625 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో కాదు, అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 12 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. నార్త్ ఇండియాలో రూ. 128 కోట్లకు పైగా వసూలు చేసింది. వీక్ డేస్ లోనూ భారీ కలెక్షన్లు అందుకోవడాన్ని బట్టి చూస్తే, కల్కి హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు 'ఇండియన్ 2' మేకర్స్ ను కలవర పెడుతోంది. 

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కమల్ హాసన్ కి ఆయన నటించిన మరో చిత్రం నుంచే గండం ఎదురుకాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ యూనివర్సల్ స్టార్ భాగం అవ్వడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చేస్తుంటే, ‘కల్కీ 2898 ఏడీ’ సందడి మరికొన్ని వారాలు ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో మరో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడమంటే, కాస్త రిస్క్ చేస్తున్నట్లే అనుకోవాలి. 'భారతీయుడు 2' సినిమాకి కచ్చితంగా కల్కి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, ఇతర భాషల్లో మాత్రం ప్రభాస్ మూవీ ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్నారు.

'కల్కి 2898 AD' మూవీలో సుప్రీం యస్కిన్ అనే పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కమల్ హాసన్ కనిపించారు. ఆయన లుక్, క్యారక్టర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. రెండో భాగంలో కమల్ పాత్ర కీలకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సీనియర్ నటుడు.. మరో పది రోజుల్లో 'ఇండియన్ 2' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. కానీ అప్పటి వరకూ 'కల్కి 2898 ఏడీ' డామినేషన్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం, కమల్ సినిమాకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవచ్చు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ పెట్టుబడులు వెనక్కి రావాలంటే, పాజిటివ్ టాక్ తో పాటుగా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవాల్సిన అవసరముంది. మరి కమల్ vs కమల్ బాక్సాఫీస్ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి. 

'భారతీయుడు'లో సేనాపతిగా అలరించిన కమల్ హాసన్.. దాదాపు 28 ఏళ్ళ తర్వాత రానున్న ‘భారతీయుడు 2’లో అదే ఓల్డ్‌ గెటప్‌లో కనిపించనున్నారు. ఈ మధ్యనే వచ్చిన ట్రైలర్ లో విభిన్నమైన గెటప్స్, పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ తో అదరగొట్టారు. ఇందులో బొమ్మరిల్లు సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్.జె. సూర్య, బాబీ సింహా, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్, యోగ్ రాజ్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ & రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. 

Also Read: వెంకటేశ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఫిక్స్ - తాళి, గన్, గులాబీలతో క్రేజీ అప్‌డేట్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget