Kamal Hassan: దీపికా చేయకపోతే ప్రెగ్నెంట్‌గా కనపడదాం అనుకున్నా - 'కల్కి' ఈవెంట్‌లో కమల్ హాసన్ కామెంట్స్
Kamal Haasan Comments at Kalki Event: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తన పాత్ర మంచి వినోదాన్ని ఇస్తుందన్నారు.
Kamal Haasan Comments on Nag Ashwin and Deepika at Kalki Event: ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ కల్కి రిలీజ్‌కు సర్వం సిద్ధమవుతుంది. మూవీ రిలీజ్‌కు ఇంకా వారం రోజులే ఉండటంతో నేడు ముంబై ప్రీ రిలీజ్ వేడుకు చాలా గ్రాండ్‌గ నిర్వహించారు మేకర్స్. బుధవారం జూన్ 19న ముంబైలో జరిగిన ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ బిగ్‌బి అబితాబ్ బచ్చన్ తన స్పీచ్‌తో, ఫన్నీ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు. అలాగే దీపికా బేబీ బంప్‌తో సందడి చేసింది.
విశ్వనటుడు కమల్ హాసన్ లుక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇక ప్రభాస్ ఎంట్రీ అయితే అదుర్స్ అనిపించేలా ఉంది. ఈవెంట్‌లో ప్రభాస్ ఎంట్రీ ఇవ్వగానే ఫ్యాన్స్ అంతా ఈళలు, అరుపులతో మారుమోగింది. ఈవెంట్ మొత్తంలో టాలీవుడ్ 'భల్లాలదేవ' రానా దగ్గుబాటి కల్కి టీంతో ఇంటాక్షన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మొత్తానికి ఈవెంట్ మొత్తం ఫుల్ జోష్‌తో సాగి మూవీని ఫుల్ ప్రమోట్ చేసింది. ఇక ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికలు షూటింగ్ సంఘనటలు కల్కి మూవీ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి.
ఈ క్రమంలో రానాతో నిర్వహించిన స్పెషల్ సెషన్‌లో ఉలగ నాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కల్కి మూవీలో తనది నెగిటివ్ రోల్ అని చెప్పాడు. అనంతరం డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్‌కి ఉంది. కల్కిలో నేను బ్యాడ్ మ్యాన్‌గా నటిస్తాను. ఇది మీకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్‌గా మూవిని ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్‌ప్రైజ్ అయినట్టే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు" అని చెప్పుకొచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హీరోయిన్ దీపికాను ఉద్దేశిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో దీపికా చేయకపోతే తాను ప్రెగ్నెంట్ కనపడదామనుకున్నానంటూ చమత్కిరించారు. అంటే ఈ చిత్రంలోనే నిజంగానే దీపికా ప్రెగ్నెంట్‌గా కనిపించబోతుందని కమల్ ఇలా హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికా కల్కిలోనూ గర్భవతిగా కనిపించనుందని కమల్ మాటలు బట్టి అర్థమైపోతుంది. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత దీపికా ఈ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపిస్తుందంటూ రూమర్స్ వచ్చాయి. వాటికి ఇప్పుడు కమల్ క్లారిటీ ఇచ్చారంటున్నారు.
Also Read: నాగి తన విజన్‌తో మహా అద్భుతంగా తీశారు - కల్కిని ఊహించటమే అసంభవం.. డైరెక్టర్ మాములోడు కాదు