Devil Trailer: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ట్రైలర్: శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూశారా? మరో విజువల్ రెడీ!
Kalyan Ram: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘డెవిల్’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ ట్రైలర్‌లో ఏజెంట్ డెవిల్ చేసిన సాహసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Kalyan Ram Devil Trailer : నందమూరి కళ్యాణ్ రామ్ గతకొంతకాలంగా కమర్షియల్ సినిమాల్లో కొత్త ఎలిమెంట్స్ కలిపి హిట్స్ అందుకున్నాడు. అదే విధంగా ‘డెవిల్’లాంటి మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బింబిసార’ సూపర్ డూపర్ హిట్ అవ్వగా.. ‘డెవిల్’కూడా అంతే హిట్ అందుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. తనతో పాటు మరో హీరోయిన్ మాళవికా నాయర్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. డిసెంబర్ 29న ‘డెవిల్’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌తో ప్రేక్షకులను పూర్తిగా 1940 రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు.
ఏజెంట్ డెవిల్ వస్తున్నాడు..
ఏజెంట్ డెవిల్ అనే పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నట్టుగా ట్రైలర్ మొదట్లోనే రివీల్ చేశాడు దర్శకుడు అభిషేక్ నామా. విజయ అనే అమ్మాయి హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారు అని తెలుసుకోవడానికి మద్రాస్‌లో ఉండే ఏజెంట్ డెవిల్‌ను పిలిపిస్తారు అధికారులు. అలా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కళ్యాణ్ రామ్.. ఎంట్రీ ఇచ్చాడు. ‘హత్య విషయంలో మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా?’ అని తన ఇన్వెస్టిగేషన్‌ను మొదలుపెడతాడు ఏజెంట్ డెవిల్. అక్కడే తనకు సంయుక్త మీనన్ పరిచయమవుతుంది. ఇక ఈ ఏజెంట్ డెవిల్ చేసే విచారణ చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఫస్ట్ హాఫ్ థ్రిల్లర్, సెకండ్ హాఫ్ యాక్షన్..
‘చాలా లోతైన మిస్టరీ’, ‘చరిత్రను మార్చే సందర్భాలు’ అంటూ ‘డెవిల్’ సినిమా గురించి ట్రైలర్‌లో రెండు మాటల్లో చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఆ తర్వాత ట్రైలర్ మరో మలుపు తిరిగింది. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్.. ఉన్నట్టుండి ఒక సీక్రెట్ ఆపరేషన్‌గా మారుతుంది. అక్కడి నుండి ట్రైలర్‌లో కమర్షియల్ రేంజ్ యాక్షన్ మొదలయ్యింది. ‘విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బ్రతకడానికి నేనేమైనా కుక్కను అనుకున్నావా? లయన్’ అని కళ్యాణ్ రామ్ చెప్పే పంచ్ డైలాగ్‌తో ‘డెవిల్’ ట్రైలర్ ముగిసింది. అంతే కాకుండా ‘శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూశారా?’ అనే డైలాగ్ కూడా ఆసక్తి కలిగిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఎలిమెంట్స్‌తో నింపడంతో.. ఈ మూవీ కొత్త కథతో పాటు యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కూడా తెరకెక్కిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
1940 కళ ఉట్టిపడేలా..
ఇప్పటికే ‘బింబిసార’లాంటి ఒక పీరియాడిక్ డ్రామాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. మళ్లీ అదే తరహా పీరియాడిక్ డ్రామాతో ఆ రేంజ్‌లో హిట్ కొట్టాలని ‘డెవిల్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌లో అన్నింటికంటే హైలెట్‌గా నిలిచింది ఆ 1940 బ్యాక్‌గ్రౌండే. ఆరోజుల్లో భవనాలు ఎలా ఉండేవో, కార్లు ఎలా ఉండేవో, ఆయుధాలు ఎలా ఉండేవో.. వాటన్నింటిని రీక్రియేట్ చేయడానికి ఆర్ట్ డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన సంగీతం కళ్యాణ్ రామ్ యాక్షన్‌కు ప్లస్ అయ్యింది. ‘డెవిల్’కు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను శ్రీకాంత్ విస్సా అందించగా.. చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే దర్శకత్వం వహించాడు అభిషేక్ నామా.
Also Read: విశ్వాసంగా ఉండటానికి కుక్కను అనుకున్నావురా? - కళ్యాణ్ రామ్ కామెంట్స్