Kalki Trailer Release Date: కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Prabhas Kalki movie trailer update: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ విడుదల తేదీని వైజయంతీ మూవీస్ సంస్థ వెల్లడించింది.
Prabhas and Deepika Padukone starrer Kalki 2898 AD trailer release date locked: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక శుభవార్త. ఆయన కథానాయకుడిగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ'. టైమ్ ట్రావెల్ జానర్ చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రభాస్ పాన్ వరల్డ్ అభిమానులను మాత్రమే కాదు... ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాళ్ళకు మరింత కిక్కు ఇవ్వడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది.
జూన్ 10న 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ విడుదల!
Prabhas Kalki Trailer Release Date: జూన్ 10న... అంటే మరో ఐదు రోజుల్లో 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వెల్లడించింది. ప్రస్తుతం బుజ్జి అండ్ భైరవ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సందడి చేస్తోంది. సినిమాలో భైరవగా ప్రభాస్ పాత్రతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు కొంచెం రుచి చూపించింది.
Also Read: ఇప్పుడు ఏపీలో 'కల్కి'ని ఆపేది ఎవ్వడ్రా... తెలుగు దేశం విజయంతో నిర్మాత అశ్వనీదత్ ఫుల్ హ్యాపీ
𝐀 𝐍𝐄𝐖 𝐖𝐎𝐑𝐋𝐃 𝐀𝐖𝐀𝐈𝐓𝐒!#Kalki2898AD Trailer on June 10th. @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/5FB0Mg6kNi
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 5, 2024
జూన్ 27న భారీ ఎత్తున సినిమా విడుదల!
Kalki Movie Release Date: జూన్ 27న 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జపనీస్, చైనీస్ భాషల్లో కూడా సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.
Welcome to the Month of KALKI… This June and this year is ours!
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 1, 2024
Let’s get together and unite to celebrate Indian Cinema like never before.#Kalki2898AD in cinemas worldwide from 27th June 2024 💥@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/aFHDfAIwfB
వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాణ సి. అశ్వినీదత్ సుమారు 500 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన చిత్రమిది. ప్రభాస్ జోడీగా హిందీ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించారు. మరొక కథానాయికగా వరుణ్ తేజ్ 'లోఫర్', సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 'ఎంఎస్ ధోని' ఫేమ్ దిశా పటనీ నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ & లోకనాయకుడు కమల్ హాసన్, తమిళ నటుడు పశుపతి సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.