అన్వేషించండి

Deepika Padukone : ప్రభాస్ 'కల్కి' ప్రమోషన్స్‌కు దీపికా పదుకొనె దూరం - కారణం అదేనా?

Deepika Padukone : ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్ దీపికా పదుకొనే దూరం కానుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Deepika Padukone to Skip Kalki promotions : పాన్ ఇండియా హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మొదటిసారి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 AD'. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో గ్రాండ్ స్కేల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో దిషా పటాని మరో కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వచ్చే నెలలో మొదలుపెట్టనున్నారు మేకర్స్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కి హీరోయిన్ దీపికా పదుకొనే దూరం కానుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

'కల్కి' ప్రమోషన్స్ కి దీపికా పదుకొనే దూరం

ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రమోషన్స్ ని మూవీ టీం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సినిమాని పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో చేయబోతున్నారు. అయితే 'కల్కి' ప్రమోషన్స్ కి దీపికా పదుకొనే దూరం కాబోతున్నట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది. నిజానికి నాగ్ అశ్విన్ ఈ సినిమాని దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ ల సహకారంతో నార్త్ లో భారీగా ప్రమోట్ చేయాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అయితే 'కల్కి' ప్రమోషన్స్ కి దీపికా పదుకొనే హాజరు కాకపోయినా ఆమె స్థానాన్ని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో కలిసి దిశా పటాని నార్త్ లో కల్కి ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

ఆ కారణం వల్లే 

'కల్కి' మూవీ ప్రమోషన్స్ కి దీపికా పదుకొనే దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఆమె గర్భం దాల్చడమే. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెప్టెంబర్ లోనే దీపిక బిడ్డకు జన్మనివ్వబోతోంది. పెళ్లయిన ఐదు సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడంతో దీపిక ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. తాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎలాంటి కొత్త సినిమాలకు సైన్ చేయలేదు.

అంతేకాదు షూటింగ్ టైంలో దూర ప్రయాణాలు ఉంటే వాటిని పూర్తిగా స్కిప్ చేస్తోంది. ఈ క్రమంలోనే 'కల్కి' ప్రమోషన్స్ కి సైతం దీపిక హాజరు కాకపోవచ్చు అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ దీపిక పదుకొనే కనుక ప్రమోషన్స్ లో పాల్గొనకపోతే అది సినిమా హిందీ వెర్షన్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. అంతేకాదు ప్రభాస్, నాగ్ అశ్విన్ తో పాటూ 'కల్కి' హిందీ వెర్షన్ ప్రమోషన్స్ ని భుజాలపై వేసుకునే బాధ్యతలను అమితాబచ్చన్, దిశా పటాని ఇద్దరూ తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read : ఆస్పత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌ - బిగ్‌బికి ఆ సర్జరీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Free Bus: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Embed widget