అన్వేషించండి

Kalki 2898 AD: హిందీ మార్కెట్​లో దుమ్మురేపుతోన్న 'క‌ల్కీ 2898 ఏడీ'.. రూ.100 కోట్లు దాటేసిన క‌లెక్ష‌న్స్

Kalki 2898 AD: 'క‌ల్కీ 2898 ఏడీ' దుమ్ము రేపుతోంది. హిందీ మార్కెట్ లో రూ.100కోట్లు దాటేసింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల వ‌ర్షం కురిపిస్తోంది.

Kalki 2898 AD Box OfficeDay 4 Hindi Collection : నాగ్ అశ్విన్, ప్ర‌భాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా ''క‌ల్కీ 2898 ఏడీ''. జూన్ 27న వీక్ డే రిలీజైంది ఈ సినిమా. కానీ, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. నాగ్ అశ్విన్ డైర‌క్ష‌న్, ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్ త‌దిత‌రుల యాక్ష‌న్, గ్రాఫిక్స్ అన్ని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో థియేట‌ర్ కి క్యూ క‌డుతున్నారు ప్రేక్ష‌కులు. దీంతో హిందీ మార్కెట్ లో దుమ్మురేపుతోంది సినిమా. కాసుల వ‌ర్షం కురిపిస్తుంది. హిందీలో ఈ సినిమా ఇప్ప‌టికే రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను దాటేసింది. 2024లో అత్యంత అధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది ఈసినిమా. మ‌రి రోజువారి క‌లెక్ష‌న్స్ ఏంటి? ఒక‌సారి చూద్దాం. 

రూ.100 కోట్లు దాటేసింది.. 

'కల్కీ 2898 ఏడీ' సినిమా హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో వారాంతంలో సినిమా చూసేందుకు ప్రేక్ష‌కుల పోటెత్తారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యింది 'కల్కీ 2898 ఏడీ'. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీలో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. అన్ని భాష‌ల్లో కూడా దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక హిందీలో అయితే ఇప్ప‌టికే రూ.100 కోట్ల క్ల‌బ్ లో చేరింది 'కల్కీ 2898 ఏడీ'. నాలుగు రోజుల‌కే దాదాపు రూ.110 కోట్లు వ‌సూళ్లు సాధించిన‌ట్లు లెక్క‌లు చెప్తున్నాయి. 

హిందీలో మొద‌టి రోజు రూ.22.5 కోట్లు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో క‌ల్లా.. ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ లో ‘కల్కీ 2898 ఏడీ’ రికార్డు సృష్టించింది. అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు అది కాస్తా రూ.23కోట్ల‌కు పెరిగింది. ఇక మూడో రోజు అదే జోరు కొన‌సాగించింది సినిమా.. రూ.26 కోట్లు సాధించింది. నాలుగో రోజు క‌లెక్ష‌న్స్ రూ.39 కోట్లు. అలా నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్ క‌లిపి మొత్తం రూ.110.5 కోట్ల‌కు చేరింది. 2024లో రిలీజైన సినిమాల్లోనాలుగో రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా కూడా 'కల్కీ 2898 ఏడీ' రికార్డుల‌కెక్కింది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ‘కల్కీ 2898 ఏడీ’ గ్రాస్ రికార్డులు రూ.500 కోట్లు దాటిన‌ట్లు లెక్క‌ల ద్వారా తెలుస్తోంది. 

పార్ట్ - 2 కోసం వెయిటింగ్.. 

'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాపై ముందు నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై ఆస‌క్తి పెరిగింది. దీంతో జ‌నాలు థియేట‌ర్ల‌కు బారులు క‌ట్టారు. ఇక సినిమా.. చూసిన వాళ్లంతా ఇప్పుడిక పార్ట్ - 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే, పార్ట్ - 2 తాలుకూ షూటింగ్ ఇప్ప‌టికే 60 శాతం పూర్తైన‌ట్లు నిర్మాత అశ్వినీ ద‌త్ ప్ర‌క‌టించారు. దీంతో పార్ట్ - 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సెకెండ్ పార్ట్ లో ప్ర‌భాస్ ని ఎలా చూపించ‌నున్నారు? అశ్వ‌థామ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ ఏం చేయ‌బోతున్నాడు అనే ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ పార్ట్ లో క‌మ‌ల్ హాస‌న్ క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంద‌నే ఇంట్రెస్ట్ ఉంది ప్రేక్ష‌కుల్లో. 'క‌ల్కీ 2898 ఏడీ'లో ప్ర‌భాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా పదుకొణే, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ డైరెక్ట‌ర్ కాగా.. వైజ‌యంతి మూవీస్ పై అశ్వ‌నీ ద‌త్ నిర్మించారు. 

Also Read: శివానీ రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. తెలుగ‌మ్మాయి అయినా అవకాశాలు త‌క్కువే.. హీరోయిన్ కూతురైనా ఓటీటీకే పరిమితమా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget