Kalki 2898 AD Story: ఈ సీరియల్ సీన్ చూస్తే.. ‘కల్కీ 2898 AD’ మూవీ స్టోరీ మొత్తం అర్థమైపోతుంది, వైరల్ అవుతోన్న కీలక సన్నివేశం
‘కల్కీ 2898 ఏడీ’ మూవీ రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ‘మహాభారతం’ సీరియల్‌లోని ఈ సీన్ గానీ.. ‘కల్కీ 2898 ఏడీ’ మూవీలో గానీ పడితే గూస్‌బంప్స్ పక్కా.
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘కల్కీ 2898 AD’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. దీంతో మూవీపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. అంతేకాదు.. భవిష్యత్తుకు, పురాణాలకు లింక్ పెట్టడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మూవీ మహాభారతానికి ముడిపడి ఉండటంతో అంతా అశ్వత్థామ, కల్కి, శంబల నగరం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా ఇండియాలోని వివిధ మూవీ ఇండస్ట్రీస్‌కు చెందిన పలువురు తారలు మహాభారతంలోని పాత్రల్లో కనిపించనున్నారనే భజ్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
మరోవైపు ఈ మూవీ కథపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ‘మహాభారత్’ సీరియల్‌లోని ఓ సీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ చూస్తే.. ‘కల్కీ 2898 ఏడీ’ మూవీ స్టోరీ మొత్తం అర్థమైపోతుందని, మూవీ చూసే ముందు ఈ సీన్ చూడండని అంటున్నారు. ఇంతకీ ఏమిటీ ఆ సీన్? అందులో ఏముంది?
సౌరభ్ రాజ్ జైన్ కృష్ణుడు/విష్ణుమూర్తి పాత్ర పోషించిన ‘మహాభారతం’ సీరియల్ 2014లో బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికీ ఈ సీరియల్ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘కల్కీ 2898 AD’లో మహాభారతం రిఫెరెన్స్ ఉండటంతో అంతా అశ్వత్థాముడి ఎపిసోడ్ కోసం నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి అందులోని ఒక కీలక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇదే ‘కల్కీ 2898 AD’ ఫ్లాష్ బ్యాక్ అని, ఆ మూవీ చేసే ముందు ఈ సీన్ తప్పకుండా చూడండని అంటున్నారు. ఇందులో ఉత్తర పాత్రలో కనిపించనున్న మాళవిక నాయర్ స్టోరీని కూడా ఈ సీన్ రివీల్ చేస్తోంది.
ఈ వైరల్ సీన్‌లో ఏముంది?
కురుక్షేత్ర యుద్ధంలో పాండవులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతాడు అశ్వత్థాముడు. దాన్ని గర్భంతో ఉన్న ఉత్తర వైపు ప్రయోగించేందుకు సిద్ధమవుతాడు. దీంతో అర్జునుడు కూడా తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అతడిని అడ్డుకోవాలని చూస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీ కృష్ణుడు వెంటనే అక్కడికి వచ్చి.. మీరు చేసే పనివల్ల సమస్త విశ్వం అంతమైపోయే ప్రమాదం ఉందని చెబుతాడు. దీంతో అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వత్థాముడు మాత్రం ఇందుకు అంగీకరించడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంతో అశ్వత్థాముడి నుదిటిపై ఉండే మణిని పెకిళిస్తాడు.
దీంతో అశ్వత్థాముడు తన బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి వదులుతాడు. మరింత కోపోద్రుక్తుడైన శ్రీ కృష్ణుడు అశ్వత్థాముడిని శపిస్తాడు. ‘‘నీకు మరణమంటే భయం లేదు కదా అశ్వత్థామా. నీ మృత్యువును నీ నుంచి తీసేసుకుంటున్నా. అమరుడు కావాలని శపిస్తున్నా. నీ శరీరం నిత్యం రగులుతూనే ఉంటుంది. అణువణువు చీము.. నెత్తురు కారుతూనే ఉంటుంది. నిన్ను ఎవరూ సమీపించరు. కొండలు కోణాల్లో అలమటిస్తావు. మృత్యువు కోసం పరితపిస్తావు’’ అని శపిస్తాడు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడు.. ఉత్తరను కలిసి ఆమె బిడ్డకు పునర్జన్మ ప్రసాదిస్తాడు. అతడే పరిక్షితుడు. ఈ సీన్‌ను ఈ కింది ట్వీట్‌లో చూడండి.
E sequence lone almost anii cameos ostay...#Prabhas
— Siva Harsha (@SivaHarsha_23) June 24, 2024
Andaru chudandi oka clarity ostndi #Kalki2898AD pic.twitter.com/M7EpXT2KIw
Also Read: విజయ్ దేవరకొండ 'కల్కి' కాదు... ప్రభాస్ సినిమాలో ఆయన రోల్ ఏమిటంటే?