Kajal Aggarwal : కన్నప్ప నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్.. ముల్లోకాలను ఏలే త్రిశక్తిగా వస్తోన్న టాలీవుడ్ చందమామ
Kannappa Movie : కన్నప్ప సినిమా నుంచి తాజాగా కాజల్ అగర్వాల్ లుక్‌ని చిత్రబృదం విడుదల చేసింది. ఈ మూవీలో కాజల్ పార్వతీ దేవిగా చేస్తున్నట్లు తెలిపింది.
Kajal Aggarwal Look From Kannappa : మంచు విష్ణు హీరోగా చేస్తూ.. డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా ఇప్పటికే ఫుల్ బజ్‌ను క్రియేట్ చేసింది. రీసెంట్గా హీరోయిన్ లుక్‌ని విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా కాజల్ అగర్వాల్ లుక్‌ని షేర్ చేసింది. ఈ సినిమాలో కాజల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు తెలిపింది. వాస్తవిక కథను పాన్ ఇండియా చిత్రంగా మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు.
పార్వతీ దేవిగా చేస్తోన్న కాజల్ అగర్వాల్ లుక్‌ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముల్లోకాలు ఏలే తల్లి.. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి.. శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక.. పార్వతి దేవి అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25, 2025వ తేదీన విడుదల కానుంది.
కాజల్ లుక్ ఎలా ఉందంటే..
వైట్, క్రీమ్ మిక్స్ అయిన, గోల్డ్ బోర్డర్‌తో వచ్చిన శారీలో కాజల్ సౌమ్యంగా కనిపించింది. చేతులకు గాజులు.. బంగారు ఆభరణాలు ధరించి.. తలలో తామరపువ్వు.. లుక్‌లో కాజల్ కనిపించగా.. ఆమె వెనుక మాత్రం శక్తి చేతిలో ఆయుధాలు కనిపించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యదార్థ గాధతో..
మహాకవిగా పేరుతెచ్చుకున్న ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నారు. విష్ణు సినిమాలో కన్నప్పగా చేస్తున్నారు. మోహన్ బాబు ఈ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తుండగా.. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా విడుదల ఎప్పుడంటే..
కన్నప్ప సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ మొదటి నుంచి మంచి హైప్‌ని మూటగట్టుకుంది. ఆడియన్స్‌కి హైప్నిస్తూ.. చిత్రబృందం కూడా ఒక్కొక్కరి పోస్టర్‌ను విడుదల చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతుంది.
Also Read : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
స్టార్ కాస్ట్ ఎవరంటే..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హైప్ రావడానికి ప్రభాస్ ఓ కారణమనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆ మధ్య లీక్ అయిన ప్రభాస్ లుక్ సినిమాపై హైప్‌ని మరింత పెంచింది. అక్షయ్ కుమార్ శివుడిగా చేస్తున్నారు. వీరే కాకుండా శరత్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు కుమారుడు కూడా ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. విష్ణు కుమార్తెలు కూడా సినిమాలో కనిపించనున్నారు.