అన్వేషించండి

Devara movie release date: ఏప్రిల్‌లో కాదు... 'దేవర' కొత్త రిలీజ్ డేట్ చెప్పిన ఎన్టీఆర్!

Devara Part 1 movie release date: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర'ను తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు డెసిషన్ మారింది. న్యూ రిలీజ్ డేట్ చెప్పారు.

Devara to release on Dussehra 2024: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'దేవర'. తొలుత ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ తేదీకి సినిమా రావడం లేదని కొన్ని రోజుల క్రితం క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఆ విషయాన్ని ఎన్టీఆర్ అఫీషియల్‌గా చెప్పారు. న్యూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. 

దసరాకు దేవర పార్ట్ 1 విడుదల 
10.10.2024... అక్టోబర్ 10న 'దేవర' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అక్టోబర్ 10 గురువారం వచ్చింది. లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ సీజన్ సినిమాకు కలిసి వస్తుందని చెప్పాలి.

'జనతా గ్యారేజ్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ఇందులో ఆయన జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు.

Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

'దేవర' వాయిదాకు కారణాలు ఏమిటి?
Reasons for Devara release postpone: అసలు 'దేవర'ను వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వెనుక పలు కారణాలు ఉన్నాయని టాక్! అందులో మొదటిది... ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.

'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ మార్కెట్ పాన్ ఇండియా దాటి జపాన్ వరకు చేరింది. ఆ సినిమా రాజమౌళి, 'బాహుబలి' బ్రాండింగ్ వల్ల విదేశాల్లోనూ బాగా ఆడింది. అయితే హోమ్ గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ కదా! తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో జూ ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లర్. ఆయన సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 5కు అటు ఇటుగా ఉండవచ్చని వినబడుతోంది. అందుకని, వాయిదా వేయాలని భావిస్తున్నారట. 

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని, ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్ ట్యూన్ ఫైనలైజ్ చేయలేదని ఫిల్మ్ నగర్ గుసగుస. పాన్ ఇండియా రిలీజ్ అంటే రెండు మూడు నెలల ముందు నుంచి పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి. సాంగ్స్ విడుదల చేయాలి. సో... ప్రజెంట్ అటువంటి సిట్యువేషన్ కనిపించడం లేదు.

Also Readఊరు పేరు భైరవకోన రివ్యూ: వరుస ఫ్లాపుల తర్వాత సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేనా? సినిమా ఎలా ఉందంటే?

'దేవర' సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యారు. చిన్న చిన్న గాయాల కారణంగా చికిత్స తీసుకోవడానికి వెళ్లారు. డిశ్చార్జి అయినప్పటికీ... ఆయన మీద తీయాల్సిన సన్నివేశాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ అవి త్వరగా తీసినా... మ్యూజిక్ లేట్ కావడం, ఏపీ ఎలక్షన్స్ వంటివి వాయిదాకు దారి తీశారని టాక్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget