అన్వేషించండి

Devara Movie: 'దేవర' సెకండ్‌ సింగిల్‌ వచ్చేసింది - ఎన్టీఆర్‌, జాన్వీల రొమాన్స్‌ మామూలుగా లేదుగా, ఆకట్టుకుంటున్న సాంగ్

Chuttamalle Song: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ సింగిల్‌ పేరుతో రొమాంటి సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. 

Devara Second Single: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ల రొమాంటిక్‌ సాంగ్ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌,బాలీవుడ్‌ జాన్వీ కపూర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్‌ మూవీ 'దేవర'.  సెప్టెంబర్‌ 27న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో దేవర నుంచి ఒక్కొక్కొ అప్‌డేట్‌ వదులుతూ మూవీపై క్యూరియాసిటీ పెంచుతుంది మూవీ టీం. ఇప్పటికే విడుదలైన  దేవర ఫియర్‌ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగష్టు 5) దేవర సెకండ్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ రిలీజ్‌ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. పోస్టర్‌లో జాన్వీ కపూర్‌, ఎన్టీఆర్‌ల కెమిస్ట్రీ బాగుందంటూ ఆడియన్స్‌ నుంచి రివ్యూస్‌ వచ్చాయి.

దీంతో ఈ రొమాంటిక్‌ సాంగ్‌ వారి ఫుల్‌ కెమిస్ట్రీ చూసేందుకు ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చుట్టుమల్లే సూట్టెస్తాందే తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు అంటూ మెలోడియస్‌ సాగింది ఈ పాట. ప్రస్తుతం ఈపాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌లపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ సాంగ్‌లో వీరిద్దరి స్టిల్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటలో జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను శిల్పా రావ్‌ ఆలిపించగా.. అనిరుద్‌ రవిచందర్‌ స్వరాలు సమకుర్చాడు. కాగా ఈ సినిమాకు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా ఆయన వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

 

అంతేకాదు ఎన్టీఆర్‌,జాన్వీల పెయిర్‌ చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌-శ్రీదేవి; ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌-జూనియర్ శ్రీదేవి అని పోల్చుతూ ఫ్యాన్స్ పోల్చుకుంటున్నారు. అంతేకాదు సీనియర్‌ ఎన్టీఆర్‌-శ్రీదేవిల ఆకుచాటు పింద తడితే రొమాంటిక్‌ పాటను, దేవర సెకండ్‌ సింగిల్‌ కలిపి చూస్తు ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. కాగా దేవరను ముందుగా ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేస్తామన్నారు. తారక్‌ ఆస్కార్‌ అవార్డు వేడులతో బిజీ అవ్వడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యింది. దీపావళి సందర్భంగా ఆక్టోబర్ 10న రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటన ఇచ్చింది.

కానీ, ఏం జరిగిందో ఏమో కానీ, ఈ సినిమాను రెండు వారాలు ముందుకు తీసుకువచ్చి సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఫైనల్ ఈ మూవీ రిలీజ్‌ కాస్తా రెండు వారాలు ముందుకు రావడంతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతికథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఫైనల్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకోని విడుదలకు రెడీ కానుంది.

Also Read: 'తంగలాన్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యాంకర్‌ సుమకు షాక్‌ - స్టేజ్‌పైనే కిస్‌ ఇచ్చిన నటుడు, అవాక్కైన యాంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget