News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

నా పెళ్లి మీరు చేస్తారా? విష్ణు ప్రియతో తనకున్న రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి!

టాలీవుడ్ ప్రముఖ నటుడు జెడి చక్రవర్తి తాజాగా 'దయ' అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ తో తనకున్న రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చారు.

FOLLOW US: 
Share:

'గులాబి', 'సత్య', 'బొంబాయి ప్రియుడు', 'ఎగిరే పావురమా', 'అనగనగా ఒక రోజు', 'మనీ' వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెడి చక్రవర్తి గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత జెడి చక్రవర్తి 'దయ' అనే వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా జెడి చక్రవర్తి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

ఆ మధ్య విష్ణు ప్రియ ఓ టీవీ షోలో జె.డి చక్రవర్తిని తను ఎంతగానో ఇష్టపడుతున్నానని, అవకాశం వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అయ్యాయి. దీంతో జెడి చక్రవర్తి, విష్ణుప్రియ ఇద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఆ వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు జెడి చక్రవర్తి. ఆ వార్తలపై స్పందిస్తూ ‘‘నా పెళ్లి మీరు చేస్తారా?’’ అని యాంకర్‌ను అడిగారు.

ఆ తర్వాత విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ.. "విష్ణు ప్రియతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. కానీ అది ప్రేమ కాదు. తనకు నాకు మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. నన్ను తను ఓ గురువుల భావిస్తుంది’’ అని చెప్పారు. ఈ 'దయ' వెబ్ సిరీస్ లో విష్ను మంచి రోల్ చేసిందని.. ఈ వెబ్ సిరీస్ చేయడానికి ముందు దర్శకుడు పవన్ విష్ణుప్రియకు నేను నటించిన సినిమాలన్నీ ప్రతిరోజు చూడమని సలహా ఇచ్చారని తెలిపారు. దాని వల్ల విష్ణు ప్రియా నేను నటించిన సినిమాలన్నీ చూసిందని, ఆ సినిమాల్లో నేను పోషించిన పాత్రలతో ఆమె ప్రేమలో పడిందని అన్నారు. కానీ తను నన్ను ప్రేమించడం లేదని, ఏదో ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల అలాంటి కామెంట్ చేసి ఉండొచ్చు గాని తమ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందంటూ క్లారిటీ ఇచ్చారు జేడి చక్రవర్తి.

అంతేకాకుండా విష్ణు ప్రియ చాలా మంచి అమ్మాయి అని, ‘దయ’ వెబ్ సిరీస్ కోసం తామిద్దరం సుమారు సుమారు 40 రోజుల పాటు కలిసి పనిచేసామని, ఈ వెబ్ సిరీస్ లో తాను ఒక మంచి రోల్ చేసిందని చెప్పారు.దీంతో జెడి చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కొన్ని నెలల క్రితం ఓ సెలబ్రిటీ గేమ్ షో లో విష్ణు ప్రియ పాల్గొంది. ఆ షోలో లో జేడీ చక్రవర్తి అంటే తనకు చాలా ఇష్టమని, అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. అంతేకాదు జెడి చక్రవర్తి వాళ్ళ అమ్మగారు అంగీకరిస్తే అతని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో అప్పట్లో ఈమె చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

ఇక దయ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. 'యూటర్న్', 'కుడి ఎడమైతే', 'సేనాపతి' వంటి సినిమాలను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని లాంగ్ గ్యాప్ తర్వాత ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. జెడి చక్రవర్తితో పాటు ఈషా రెబ్బ, విష్ణు ప్రియ, కమల్ కామరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. జెడి చక్రవర్తి నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఆడియన్స్ సైతం ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Also Read : విశ్వక్ సేన్ 'నో' చెప్పిన విధానం నచ్చలేదు, ఆ వివాదంపై కీలక విషయాలు చెప్పిన 'బేబీ' డైరెక్టర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 02 Aug 2023 02:24 PM (IST) Tags: vishnupriya anchor vishnu priya Jd chakravarthi Actor JD Chakravarthi JD Chakravarthi Daya Web Series

ఇవి కూడా చూడండి

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

Bhagavanth Kesari Songs : 'భగవంత్ కేసరి' బంధం విలువ చెప్పే పాట - 'ఉయ్యాలో ఉయ్యాల' రిలీజ్ ఎప్పుడంటే?

Bhagavanth Kesari Songs : 'భగవంత్ కేసరి' బంధం విలువ చెప్పే పాట - 'ఉయ్యాలో ఉయ్యాల' రిలీజ్ ఎప్పుడంటే?

'చంద్రముఖి 2' కోసం లారెన్స్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ - ఎన్ని కోట్లో తెలుసా?

'చంద్రముఖి 2' కోసం లారెన్స్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ - ఎన్ని కోట్లో తెలుసా?

టాప్ స్టోరీస్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్