‘జవాన్’ మ్యూజిక్ రైట్స్ - ఓ మై గాడ్, ఆడియో రైట్సే అంత ఉంటే, మూవీకి ఎంత డిమాండ్ ఉంటుందో!
షారూఖ్ ఖాన్ లేటెస్ట్ చిత్రం 'జవాన్' మ్యూజిక్ రైట్స్ ను ప్రముఖ సంస్థ టీ సిరీస్ దక్కుంచుకుంది. రూ.36కోట్లతో కొనుగోలు చేసిన టీ సిరీస్... ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. దీంతో మూవీపై బజ్ మరింత ఎక్కువైంది.
Jawan Music Rights : 'పఠాన్' మూవీ తర్వాత బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ చేయబోయే చిత్రం 'జవాన్' కోసం కోట్లాది మంది అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పలు ఫుటేజ్ వీడియోలు ఇటీవలే లీకై సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆరంభం నుంచే ఎనలేని బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా 'జవాన్'కు సంబంధించిన ఓ వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ హక్కులను టీ సిరీస్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
లేడీ సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ 'జవాన్' సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న అత్యంత గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా తాజాగా ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ టీ సిరీస్ రూ.36 కోట్లకు సొంతం చేసుకోవటం టాక్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీగా మారింది. 'జవాన్' మ్యూజిక్ రైట్స్ కోసం చాలా మంది పోటీ పడ్డట్టు తెలుస్తోంది. కానీ ఎట్టకేలకు పోటీలో ముందంజలో నిలిచి, రూ.36 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో 'జవాన్' విడుదలకు ముందే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన జవాన్.. మరోసారి షారూక్ ఖాన్ సత్తా ఏంటో చూపించింది.
'జవాన్' సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ టీజర్ వచ్చినప్పటి నుండి, అభిమానులు పవర్ ప్యాక్డ్ ఆల్బమ్ కోసం ఎదురు చూస్తున్నారు. నివేదికల ప్రకారం, మేకర్స్ టీజర్‌ను జూలై 7 న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతితో పాటు యోగి బాబు, సన్యా మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్ తదితరులు ఉన్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
అక్కడ విడుదలైన తొలి హిందీ సినిమా 'పఠాన్'
నాలుగేళ్ల విరామం తర్వాత 'పఠాన్' తో వెండితెరపై కనిపించిన షారుఖ్ ఖాన్... బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా.. దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దాదాపు రూ.1000 కోట్లను రాబట్టింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే బంగ్లాదేశ్ లో విడుదలైన తొలి హిందీ సినిమాగానూ రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకునే నటించింది. సూపర్ హిట్ గా నిలిచి బాలీవుడ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చిన సినిమాగా 'పఠాన్' నిలిచింది.
Read Also : Ram Charan Daughter Name : మెగా మనవరాలికి పేరు పెట్టేశారోచ్ - రామ్ చరణ్, ఉపాసన కుమార్తె పేరు ఏమిటంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial