News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jawan SRK Doppelganger : 'జవాన్'లో షారుఖ్ డూప్‌గా నటించింది ఈయనే - సేమ్ టు సేమ్ షారుఖ్‌లా

షారుఖ్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'జవాన్'. అందులో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. మరి, రెండు క్యారెక్టర్లలో ఎలా నటించారు? అంటే... ఆయనకు ఓ డూప్ ఉన్నారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన 'జవాన్' (Jawan) సినిమా థియేటర్లలో దుమ్ము రేపుతోంది. వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. తమిళ దర్శకుడు అట్లీ  (Atlee) తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ చేశారు. తెరపై తండ్రీ కొడుకులుగా కనిపించారు. స్క్రీన్ మీద ఒకేసారి ఇద్దరు షారుఖ్స్ (Shah Rukh Khan) కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే... ఆ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారు? అంటే... షారుఖ్ ఖాన్ డూప్ ఒకరు ఉన్నారు.

పదిహేనేళ్ళుగా షారుఖ్ డూప్ ఇతనే!
ప్రశాంత్ వాల్డె (Prashant Walde)... హిందీ చిత్రసీమ వర్గాలకు ఈయన చాలా బాగా తెలుసు. ఎందుకంటే... సుమారు పదిహేనేళ్లుగా షారుఖ్ ఖాన్ బాడీ డబుల్ / డూప్ (Shah Rukh Khan Body Double)గా చేస్తున్నారు. ఈయన 2007 నుంచి షారుఖ్ తో ట్రావెల్ చేస్తున్నారు. 'జవాన్' సినిమాలోనూ షారుఖ్ బాడీ డబుల్ కింద చేశారు. ఆ సినిమా కోసం ఆయన ఏ విధంగా మేకప్ అయ్యిందీ వీడియోస్ కూడా విడుదల చేశారు. 

View this post on Instagram
 
A post shared by Prashant Walde (@prashantwalde)

షారుఖ్ కొడుకు అయితే ప్రశాంత్ తండ్రి...
ప్రశాంత్ తండ్రి అయితే షారుఖ్ కొడుడు!
'జవాన్' కోసం తాము ఏ విధంగా షూటింగ్ చేసినదీ లేటెస్టుగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వాల్డె తెలిపారు. ఆయన మాట్లాడుతూ ''సినిమాలో ఓ సన్నివేశం ఉంది. తండ్రిని కుమారుడు ఆత్మీయంగా కౌగిలించుకునే సీన్! అది చేసేటప్పుడు షారుఖ్ యంగ్ గెటప్ (కొడుకు) వేస్తే... నేను ఓల్డ్ గెటప్ (తండ్రి) వేశా. నన్ను కౌగిలించుకునే సమయంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. తర్వాత నేను కొడుకు గెటప్ వేస్తే... షారుఖ్ ఓల్డ్ గెటప్ (తండ్రిది) వేశారు. అప్పుడు తండ్రి క్లోజప్ షాట్స్ తీశారు. ఒకేరోజు మేమిద్దరం రెండు వేర్వేరు లుక్స్/ గెటప్స్ వేయాల్సి వచ్చింది'' అని చెప్పుకొచ్చారు. 

Also Read షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Prashant Walde (@prashantwalde)

'జవాన్'కు మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. హిందీ వెర్షన్ వరకు చూస్తే... ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ బరిలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రకు ఎక్కింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 129 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు కూడా థియేటర్ల దగ్గర జన సందోహం భారీగా కనిపించింది. శుక్రవారం కూడా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఈజీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read 'జవాన్' హిట్టే కానీ 'బాహుబలి 2'ని బీట్ చేయలేదు - ప్రభాస్ రికార్డ్స్ సేఫ్!

షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ 'జవాన్' చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాతో సౌత్ క్వీన్ నయనతార హిందీ చిత్రసీమకు పరిచయం అయ్యారు. దీపికా పదుకోన్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రియమణి, సాన్యా మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు చేశారు. తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 09 Sep 2023 10:48 AM (IST) Tags: Shah Rukh Khan Jawan Jawan Collections Body Double Prashant Walde Jawan BTS Videos SRK Doppelganger SRK Body Double

ఇవి కూడా చూడండి

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Sanya Malhotra: నాలో నేను బాధపడుతున్నా, ‘జవాన్’ బ్యూటీ ఆవేదన- అసలు ఏం జరిగిందంటే?

Sanya Malhotra: నాలో నేను బాధపడుతున్నా, ‘జవాన్’ బ్యూటీ ఆవేదన- అసలు ఏం జరిగిందంటే?

తెలుగు హీరోల్లో నాకున్న ఒక ఒక్క ఫ్రెండ్ బాలకృష్ణ మాత్రమే, తమిళంలో ఎవరు క్లోజ్ అంటే : దగ్గుబాటి రాజా

తెలుగు హీరోల్లో నాకున్న ఒక ఒక్క ఫ్రెండ్ బాలకృష్ణ మాత్రమే, తమిళంలో ఎవరు క్లోజ్ అంటే : దగ్గుబాటి రాజా

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Mansion 24 Web Series : 'మ్యాన్షన్ 24'కి వెళ్లిన వరలక్ష్మి ప్రాణాలతో బయట పడిందా? ఓంకార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

Mansion 24 Web Series : 'మ్యాన్షన్ 24'కి వెళ్లిన వరలక్ష్మి ప్రాణాలతో బయట పడిందా? ఓంకార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!