అన్వేషించండి

Janhvi Kapoor: అది తెలుసుకోవడం చాలా ముఖ్యం - తిరుపతిపై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janhvi Kapoor: శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తన లైఫ్‌లో ఎలాంటి స్పెషల్ సందర్భం వచ్చినా కూడా ముందుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటుంది. అలా ఎందుకు చేస్తుందో తాజాగా బయటపెట్టింది.

Janhvi Kapoor About Tirupati: అతిలోక సుందరి శ్రీదేవిపై ఉన్న అభిమానంతో తన వారసురాలు జాన్వీ కపూర్‌ను కూడా మన ఇంటి అమ్మాయిగా ఒప్పుకున్నారు తెలుగు ప్రేక్షకులు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అక్కడ తన టాలెంట్ ఏంటో ఇప్పటికే నిరూపించుకుంది జాన్వీ. కానీ తెలుగులో మాత్రం తను ఇంకా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా కూడా అప్పుడే తనకు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రతీ స్పెషల్ సందర్భానికి తిరుపతికి వెళ్లే జాన్వీ కపూర్.. తాజాగా తన తిరుపతి అంటే ఎంత స్పెషల్ అని బయటపెట్టింది. ఒక ఈవెంట్‌లో తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సమాధానం ఊహించవచ్చు..

‘‘మీరు మీ ఫ్యామిలీతో కలిసి చాలావరకు ప్రపంచాన్ని చూశారు. ఈ సమ్మర్‌లో ఇండియన్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోటుకి వెళ్లాలి అంటే ఏ చోటుకి వెళ్లమని సలహా ఇస్తారు?’’ అంటూ జాన్వీ కపూర్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘ప్రత్యేకంగా ఈ సమ్మర్ గురించి అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతీ ప్రాంతంలోని ప్రజలు ఎండల వల్ల, వాతావరణం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినా కూడా అందరు వెళ్లమని సలహా ఇచ్చే ప్రాంతం అయితే ఒకటి ఉంది. నా నోటి నుంచి ఈ సమాధానం వస్తుందని చాలామంది ఊహించవచ్చు. అదే తిరుపతి’’ అని చెప్తూ నవ్వింది జాన్వీ కపూర్.

తెలుసుకోవడం ముఖ్యం..

తిరుపతి అంటే తనకు ఎంత స్పెషల్ అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ‘‘నేను అయితే తిరుపతికి ప్రతీ కొన్ని నెలలకు ఒకసారి వెళ్తుండాలి. అక్కడికి వెళ్లిన ప్రతీసారి చాలా బాగుంటుంది. నాకు నేను ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అది నన్ను ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. నా రూట్స్ ఏంటని చాలా రకాలుగా గుర్తుచేస్తుంది. నా వరకు అలాంటి ప్రాంతం తిరుపతి. కానీ మీకు మీ రూట్స్ ఏంటని గుర్తుచేసే ప్రాంతానికి వెళ్లడం మంచిదని నేను అనుకుంటాను. మీరు ఎక్కడికి నుంచి వచ్చారు, మీ పూర్వీకులు ఎవరు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది మీరు ఎవరు అని తెలుసుకునే ధైర్యాన్ని మీకు ఇస్తుంది’’ అంటూ తిరుపతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ కపూర్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..

సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో కూడా బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం హిందీలో జాన్వీ నటించిన ‘మిస్టర్ అండ్ మిసేస్ మహి’, ‘ఉలఝ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగులో ఎన్‌టీఆర్ సరసన నటిస్తున్న ‘దేవర’తో డెబ్యూ సిద్ధమయ్యింది ఈ భామ. ఈ మూవీ ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది. ‘దేవర’ విడుదల కాకపోయినా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో కూడా జాన్వీ కపూరే హీరోయిన్‌గా ఎంపికయ్యింది.

Also Read: అనిల్‌ను ముసుగేసి కొడితే పదివేలు ఇస్తా, రాజమౌళి షాకింగ్ కామెంట్స్ - రావిపూడి రియాక్షన్ ఇదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget