అన్వేషించండి

SS Rajamouli: అనిల్‌ను ముసుగేసి కొడితే పదివేలు ఇస్తా, రాజమౌళి షాకింగ్ కామెంట్స్ - రావిపూడి రియాక్షన్ ఇదే!

సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కృష్ణమ్మ’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి, మరో దర్శకుడు అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

SS Rajamouli On Anil Ravipudi: విభిన్న కథాంశాలతో సినిమాలో తీయడంలో ముందుంటాడు నటుడు సత్యదేవ్. ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో నటిస్తున్నారు.  అందులో ‘కృష్ణమ్మ’ సినిమా ఒకటి. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. మే 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో అభిమానులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు డైరెక్టర్లు ఎస్ ఎస్ రాజమౌళి, అనిల్ రావిపూడి గెస్టులుగా హాజరయ్యారు.

‘కృష్ణమ్మ’ టీమ్ పై రాజమౌళి ప్రశంసలు

‘కృష్ణమ్మ’ సినిమాకు వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన దర్శకుడు రాజమౌళి, చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. సత్యదేవ్ నటన, గోపాల కృష్ణ దర్శకత్వం, భైరవ సంగీతం అద్భుతం అని కొనియాడారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా చక్కటి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం కలుగుతుందన్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

రాజమౌళి కామెంట్స్‌కు అనిల్ రావిపూడి షాక్

స్పీచ్ లో భాగంగా రాజమౌళి, అనిల్ రావిపూడిపై చేసిన కామెంట్స్ ఫుల్ ఫన్ కలిగించాయి. నిజానికి రాజమౌళి కంటే ముందు మాట్లాడిన అనిల్ రావిపూడి.. ‘దేవర’ విడుదల తేదీ ఎప్పుడో చెప్పాలని కొరటాల శివను కోరాడు. అటు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఓపెనింగ్ ఎప్పుడు? జానర్, కథ ఏంటో చెప్పాలని రాజమౌళిని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత మైక్ తీసుకున్న రాజమౌళి అనిల్ కు ఓ రేంజిలో పంచ్ ఇచ్చాడు. “నాకు ఓ కోరిక ఉంది. ఎవరైనా అనిల్ రావిపూడిని కెమెరాతో ఫాలో అవుతూ, ఇంకో వ్యక్తి అతడిపై ముసుగేసి గుద్దితే పది వేలు ఇస్తాను” అని ఆఫర్ ఇచ్చాడు. ఈ మాటలు విని అనిల్ రావిపూడి షాక్ అయ్యాడు. ప్రస్తుతం రాజమౌళి, అనిల్ రావిపూడి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  

సినిమాపై భారీగా అంచనాలు పెంచిన ట్రైలర్

మరోవైపు తాజాగా విడుదలైన ‘కృష్ణమ్మ’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కోర్టు, కేసు చూట్టు తిరిగి ఈ ట్రైలర్‌ లో సత్యదేవ్‌ ను ఖైదీగా చూపించారు. కోర్టు ముందుకు సత్యదేవ్‌ను తీసుకువస్తున్న సీన్‌తో ట్రైలర్‌ మొదలు కాగా, చేయని తప్పుకు బలి చేసే ప్రయత్నం కనిపించింది. చివరకు తనపై మోపిన కేసుతో సత్యదేవ్ తో పాటు అమాయకులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే కథాశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. 

Read Also: నా కల నెరవేరింది, నరేశ్ వల్లే ఇది సాధ్యమయ్యింది - జానీ లివర్ కూతురు జేమీ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget