By: ABP Desam | Updated at : 25 May 2022 09:20 AM (IST)
చిరంజీవి
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) - మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా టైటిల్ ఇది! ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు అనుకోండి. అయితే, మెగాస్టార్ లీక్ చేసేశారు. అసలు, ఈ సినిమా కథేంటి? ఇందులో చిరంజీవి క్యారెక్టర్ ఏంటి? అనే వివరాలు బయటకు రానివ్వడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారు. వాల్తేరుకు మాత్రమే కథ పరిమితం కావడం లేదు. విదేశాలకూ వెళుతోంది.
'వాల్తేరు వీరయ్య' ప్రీ లుక్, తర్వాత విడుదల చేసిన లుక్స్ చూశారా? ఒక పడవ... దాని మీద లుంగీ కట్టిన చిరు లుక్ ఒకటి విడుదల చేశారు. గాగుల్స్ పెట్టుకుని స్టయిల్‌గా బీడీ కాలుస్తున్న మరో లుక్ విడుదల చేశారు. లైటర్ మీద లంగరు సింబల్ ఉంది. వాల్తేరులోని జాలరిపేటలో మెగాస్టార్ క్యారెక్టర్ మొదలు కానుంది. అక్కడ నుంచి విదేశాలు వెళుతుంది. పడవ వేసుకుని సముద్రంలో వేటకు వెళ్లే వీరయ్య, మలేషియా ఎందుకు వెళ్లారు? అనేది ట్విస్ట్. గ్యాంగ్‌స్టర్‌గానూ చిరంజీవి కనిపిస్తారని టాక్. గ్యాంగ్‌స్టర్స్‌కు ఎదురువెళ్ళే తరహాలో క్యారెక్టర్ ఉంటుందట.
జూన్ తొలి వారంలో మెగాస్టార్ అండ్ Mega 154 సినిమా టీమ్ మలేషియా వెళ్ళడానికి రెడీ అవుతోంది. జూన్ నెలాఖరు వరకూ అక్కడ షూటింగ్ చేయనున్నారు. ప్రస్తుతానికి 30 శాతం సినిమా కంప్లీట్ అయ్యింది. మలేషియా షెడ్యూల్‌తో దాదాపు 60 శాతం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకు సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలనేది దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ప్లాన్.
Also Read: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్
'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జీకే మోహన్, ప్రవీణ్ సహ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ స్వయంగా కథ, మాటలు రాయగా... కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే రాశారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్ లో హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా ఉన్నారు. త్వరలో సినిమా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు, కొత్త జంట డ్రస్సులు చూశారా?
Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!
Pakka Commercial: గోపీచంద్ హిట్ కొట్టాల్సిందే - లేదంటే!
Devi Sri Prasad: దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ సల్మాన్ కి నచ్చలేదా? ప్రాజెక్ట్ నుంచి అవుట్!
Samantha: పోటీ నుంచి తప్పుకుంటున్న సమంత - త్వరలోనే క్లారిటీ?
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !