Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Tripti Dimri Controversy: బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి తాజా వివాదం కారణంగా ఆమె సినిమాలను బ్యాన్ చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది. మరి ఆ వివాదం ఏంటో తెలుసుకుందాం పదండి.
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri Controversy) ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. నిన్న మొన్నటి దాకా ఆమె చేసిన డాన్స్ చెత్తగా ఉందంటూ విమర్శలను ఎదుర్కొన్న త్రిప్తి తాజాగా ఓ ఈవెంట్ కు వస్తానని రాకుండా డబ్బులు తీసుకుని, మోసం చేసిందనే వివాదం తెరపైకి వచ్చింది. మరి ఇంతకీ త్రిప్తి దిమ్రి ఎవరిని మోసం చేసింది? ఈ వివాదం ఏంటి? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
డబ్బులు తీసుకొని ఈవెంట్ కొట్టిన త్రిప్తి
'యానిమల్' సినిమాలో కనిపించింది కాసేపే అయినా బోల్డ్ సీన్స్ తో థియేటర్లను షేక్ చేసింది త్రిప్తి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మికా మందన్నా కంటే సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తికే ఎక్కువగా పాపులారిటీ, గుర్తింపు దక్కాయి. ఆమెను చూడడానికే చాలా మంది థియేటర్లకు ఎగబడ్డారనేది కూడా నగ్నసత్యం. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తృప్తి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఆమె ఇంటి ముందు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో బాలీవుడ్ లో ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో త్రిప్తి కూడా చేరిపోయింది.. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.
సోమవారం జైపూర్ లో జరగవలసిన ఒక ఈవెంట్ కు వస్తానని రాకుండా హ్యాండ్ ఇచ్చిందట తృప్తి. ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ నిర్వహించిన ఒక ఈవెంట్ కోసం త్రిప్తిని మహిళా వ్యాపారవేత్తలు గెస్ట్ గా ఆహ్వానించారు. జైపూర్లో ఉన్న జేఎల్ఎన్ మార్క్ లోని ఒక హోటల్లో నారీ శక్తిపై ఈ ఈవెంట్ ను నిర్వహించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల త్రిప్తి ఈవెంట్ కు హాజరు కాలేక పోయింది. కానీ ఈవెంట్ నిర్వాహకులు ఫోన్ చేస్తే తను 5 నిమిషాల్లో వస్తానని చెప్పి ఆ తర్వాత ఈవెంట్ ను ఎగ్గొట్టిందట. హాజరు కాకపోయినా ఈవెంట్ కోసం ఆమె రూ. 5.5 లక్షలను తీసుకుందని ఈవెంట్ నిర్వాహకులలో ఒకరు వెల్లడించారు. ఇక త్రిప్తి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు మహిళా వ్యాపారవేత్తలు ఆమె కోసం ఏర్పాటు చేసిన పోస్టర్ పై బ్లాక్ ఇంక్ తో రాంగ్ మార్క్ గీస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
This is so bad, ya! Just because #TriptiiDimri is a celeb that doesnt give anyone the right to do such things for a meagre 5 L.
— Bollywood Talkies (@bolly_talkies) October 1, 2024
Not only her, many actors will be scared to attend ficci flo’s events #VickyVidyaKaWohWalaVideo
pic.twitter.com/vPOnA7MwOt
త్రిప్తి సినిమాను బ్యాన్ చేయాలని పిలుపు
తమను ఈ విధంగా మోసం చేసిన త్రిప్తిపై కేసు నమోదు చేస్తామని మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు. అక్కడితో ఆగకుండా త్రిప్తి సినిమాలను బ్యాన్ చేయాలని సదరు వ్యాపారవేత్తలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో త్రిప్తి హీరోయిన్ గా నటించిన కొత్త సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వివాదంపై మీడియా త్రిప్తి టీంను సంప్రదించగా వాళ్ళు దీనిపై స్పందించడానికి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. కాగా త్రిప్తి ప్రస్తుతం రాజ్ కుమార్ రావుతో కలిసి 'విక్కీ ఔర్ విద్యా కా వో వాలా' అనే సినిమాతో బిజీగా ఉంది. 90ల నాటి కాలంలో కొత్తగా పెళ్లయిన జంట పోగొట్టుకున్న తమ సెక్స్ టేప్ నేపథ్యంలో సాగే ఈ కామెడీ ఎంటర్టైనర్ అక్టోబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో త్రిప్తి బిజీగా ఉంది. ఇందులో మల్లికా షెరావత్, రాకేష్ బేడీ, విజయరాజ్, ముఖేష్ తివారి కీలకపాత్రలను పోషించారు. మరి మహిళా వ్యాపారవేతల ఆగ్రహం ఈ సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.