అన్వేషించండి

Bhola Shankar vs Jailer : మెహర్ 'భోళా శంకర్' దెబ్బకు పెరిగిన 'జైలర్' టికెట్ సేల్స్!

'భోళా శంకర్' విడుదలైన తర్వాత, విమర్శకుల రివ్యూలు వచ్చిన తర్వాత 'జైలర్' టికెట్ సేల్స్ పెరిగాయి. భోళా దెబ్బకు వీకెండ్ జైలర్ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చిరంజీవి (Chiranjeevi), రజనీకాంత్ (Rajinikanth)... ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకరు మెగాస్టార్ అయితే... ఇంకొకరు సూపర్ స్టార్! ఓ విధంగా చెప్పాలంటే... ఇద్దరూ సమ ఉజ్జీలు. తమిళంతో పాటు తెలుగులో కూడా రజనీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటే... తెలుగులో చిరంజీవికి అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో వచ్చాయి.

'జైలర్'తో రజనీకాంత్ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వస్తే... చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' ఆగస్టు 11న విడుదలైంది. 'జైలర్'కు మొదటి రోజు ఫుల్ హిట్ టాక్ ఏమీ రాలేదు. అబౌవ్ ఏవరేజ్ టు హిట్ అన్నారు విమర్శకులు. అయితే, సినిమా విడుదలకు ముందు తమన్నా సాంగ్ 'నువ్ కావాలయ్యా' పాపులర్ కావడం, ప్రచార చిత్రాలు బావుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్ సేల్స్ బావున్నాయి. ఇక, 'భోళా శంకర్' విషయానికి వస్తే... ముందు నుంచి సినిమాపై అంచనాలు ఏమీ లేవు. అయితే... మెగాస్టార్ మేనియా వర్కవుట్ అయ్యింది. 

'భోళా శంకర్' విడుదలకు ఒక్క రోజు ముందు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో లక్షా 60 వేలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. థియేటర్ల దగ్గర అమ్మే టికెట్స్, మిగతా టికెటింగ్ యాప్స్‌లో సేల్స్ వీటికి అదనం. ఇప్పుడు చూస్తే... సీన్ రివర్స్ అయ్యింది. 

భోళా దెబ్బకు పెరిగిన 'జైలర్' టికెట్ సేల్స్!
'భోళా శంకర్'కు మార్నింగ్ షోస్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో సైతం సినిమా బాలేదని చెబుతున్నారు. మెగా అభిమానులు తప్ప మిగతా వాళ్ళు సినిమా బావుందని చెప్పడం లేదు. మిక్స్డ్ టాక్ కూడా లేదు. విమర్శకుల నుంచి కూడా గొప్ప రివ్యూలు ఏమీ రాలేదు. 'భోళా శంకర్' అవుట్ డేటెడ్ సినిమా అని, చిరు & మెహర్ రమేష్ డిజప్పాయింట్ చేశారని రాసుకొచ్చారు. ఆ ఎఫెక్ట్ టికెట్ సేల్స్ మీద పడింది. 

Also Read మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

'భోళా శంకర్' విడుదలైన రోజు (ఆగస్టు 11) మధ్యాహ్నం బుక్ మై షో యాప్ చూస్తే... గంటలో 'జైలర్' టికెట్స్ 44 వేలు అమ్ముడైతే, 'భోళా శంకర్' టికెట్ సేల్స్ కేవలం 10 వేల మార్క్ దగ్గరకు వచ్చి ఆగింది. దీనికి రెండు కారణాలు. ఒకటి... 'భోళా శంకర్' సేల్స్ గురువారం బావున్నాయి. శుక్రవారం కోసం చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. రెండు... 'భోళా శంకర్'పై నెగిటివ్ టాక్. 

Bhola Shankar vs Jailer : మెహర్ 'భోళా శంకర్' దెబ్బకు పెరిగిన 'జైలర్' టికెట్ సేల్స్!

రెండు సినిమాల రివ్యూలు, టాక్ కంపేర్ చేసుకున్న కామన్ ఆడియన్స్... 'జైలర్'కు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. 'జైలర్' సేల్స్ పెరగడానికి కారణం 'భోళా శంకర్'కు వచ్చిన టాక్. ట్రేడ్ వర్గాలు సైతం 'జైలర్'కు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 'జైలర్'కు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. వీకెండ్ తర్వాత థియేటర్లలో ఈ రెండు సినిమాల్లో ఏది బలంగా నిలబడుతుందో చూడాలి. 

Also Read 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget