News
News
X

Jailer Movie Poster : డ్యూటీ ఎక్కిన రజనీకాంత్ - ఖైదీలకు చుక్కలే

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'జైలర్'. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలైంది.

FOLLOW US: 

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'జైలర్' (Jailer Movie). నయనతార ప్రధాన పాత్రలో 'కో కో కోకిల', శివ కార్తికేయన్ హీరోగా 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'మాస్టర్' సినిమాలు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రజనీకి 169వ సినిమా. ఈ రోజు సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను యూనిట్ షేర్ చేసింది.
 
సెట్స్ మీదకు 'జైలర్'
ఈ సినిమాలో రజనీకాంత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఆయన జైలర్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ రోజు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ''నేడు జైలర్ తన యాక్షన్ స్టార్ట్ చేశారు'' అని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. అంతే కాదు... సూపర్ స్టార్ కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. జైలు అధికారిగా ఖైదీలకు  చుక్కలు చూపించే పాత్రలో రజనీకాంత్ నటన కొత్తగా ఉండబోతుందని తమిళ సినిమా పరిశ్రమ టాక్. ఆయన అయితే జైలర్ డ్యూటీ ఎక్కేశారు.

హైదరాబాద్‌లోనే 'జైలర్'
ప్రస్తుతం రజనీకాంత్ హైదరాబాద్ సిటీలో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ ప్రముఖ స్టూడియోలో సినిమా కోసం జైలు సెట్ వేశారు. అందులో షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజులు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి.

రజనీకి జోడీగా రమ్యకృష్ణ
'జైలర్' సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటించనున్నారు. గతంలో వీళ్లిద్దరి కలయికలో పలు హిట్ సినిమాలు వచ్చాయి. అందులో 'నరసింహ' ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన రోల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పటికీ రమ్యకృష్ణ బెస్ట్ రోల్స్ అంటే నీలాంబరి పాత్ర ముందు వరుసలో ఉంటుంది. చాలా సంవత్సరాల విరామం తర్వాత రజనీతో ఆవిడ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నారని తమిళ సినిమా పరిశ్రమ వర్గాల సమాచారం.

తమన్నా కూడా ఉన్నారా?
'జైలర్' సినిమాలో తమన్నా భాటియా కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే... ఇప్పటి వరకూ ఆ విషయాన్ని చిత్ర బృందం కన్ఫర్మ్ చేయలేదు. రజనీతో కూడా తమన్నా ఇంత వరకు నటించలేదు. ఒకవేళ ఈ సినిమా కన్ఫర్మ్ అయితే... రజనీ - తమన్నా కలయికలో ఇదే తొలి సినిమా అవుతుంది. 

Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?

అనిరుధ్ సంగీతంలో... 
'జైలర్' సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన సినిమాలకూ ఆయనే సంగీతం అందించారు.

Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Published at : 22 Aug 2022 12:59 PM (IST) Tags: Rajinikanth Nelson Dilipkumar Jailer Movie Update Jailer Movie New Poster Jailer Shoot Begins

సంబంధిత కథనాలు

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?