Jailer 2 Release Date: జైలర్ 2 రిలీజ్ డేట్... దసరాకు థియేటర్లలోకి రజనీ సినిమా - అఫీషియల్‌గా అనౌన్స్ చేశారోచ్
Rajinikanth Jailer 2 Release Date: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?

Jailer 2 Movie Release Date Official Announced: సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీ సృష్టించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఆ సంగతి తమిళ, తెలుగు, పాన్ ఇండియా ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఇవాళ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
దసరాకు రజనీకాంత్ ధమాకా!
Jailer 2 Official Release Date: అక్టోబర్ 20న విజయదశమి. ఈ ఏడాది దసరాకు థియేటర్లలో రజనీకాంత్ ధమాకా రానుంది. 'జైలర్' భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'జైలర్ 2' మీద అంచనాలు విపరీతంగా పెరిగాయి. థియేటర్లలోకి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అప్డేట్ ఇచ్చింది.
అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా 'జైలర్ 2'ను విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమా విడుదల కానుంది.
వర్మ వెనుక ఉన్న నెట్వర్క్ ఎవరు?
Jailer 2 Story Hint In Release Date Teaser: 'జైలర్' కథను ఎక్కడ అయితే ముగించారో... అక్కడ నుంచి 'జైలర్ 2'ను అక్కడ నుంచి మొదలు పెడుతున్నారని రిలీజ్ డేట్ టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
'జైలర్'లో విలన్ వర్మ (వినాయకన్)ను ముత్తు... 'టైగర్' ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) చంపేస్తాడు. మరణించే ముందు వర్మ 'నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఒక పెద్ద ప్రపంచమే నా వెనుకాల ఉంది జైలర్. ఇదొక పెద్ద నెట్వర్క్. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారో తెలియదు. నీ జీవితమే నరకం అవుతుంది చూసుకో' అని చెబుతాడు. ఆ తర్వాత విలన్స్ ముఖాలను కనిపించీ కనిపించకుండా చూపించారు. వాళ్ళతో ముత్తువేల్ ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది 'జైలర్ 2' కథ అని అర్థం అవుతోంది.
'జైలర్' కంటే మరింత గ్రాండ్‌గా ఈ సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మొదటి పార్ట్ విజయంలో అనిరుధ్ రవిచందర్ సంగీతం కీలక పాత్ర పోషించిన తెలిసిందే. 'జైలర్'కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ సినిమాను బ్లాక్ బస్టర్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడీ సీక్వెల్ 'జైలర్ 2'కు కూడా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సేమ్ మేజిక్ రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు. రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా మీనన్ తదితరులు ఈసారి కూడా కనిపించనున్నారు.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















