Rudrangi Release Date: థియేటర్లలోకి వచ్చేస్తున్న 'రుద్రంగి' - రిలీజ్ ఎప్పుడంటే?
అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తోన్న 'రుద్రాంగి' జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. తెలంగాణ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న తొలి చిత్రంగా ఈ సినిమా రూపొందింది.
Rudrangi : తెలంగాణ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న తొలి చిత్రం 'రుద్రంగి' జూలై 7న థియేటర్లలోకి రానుంది. హీరో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్‌దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'రుద్రాంగి'కి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీపై అప్డేట్ రివీల్ చిత్ర యూనిట్.. జూలై 7న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే రుద్రంగి సినిమాలోని అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. మూవీలోని పాటలు, టీజర్ విడుదలై.. ఈ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో తెలంగాణ సామాజిక పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ మూవీగా 'రుద్రంగి'ని తెరకెక్కించారు. తెలంగాణలో గతంలో దొరల ఎజెండాలు ఎలా ఉండేవో ఈ చిత్రంలో చూపించారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
ఈ సినిమాలో హీరో జగపతి బాబు, ఆశిష్ గాంధీ, లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్ తో పాటు కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - సంతోష్ శనమోని, ఎడిటింగ్ - బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంగీతం - నాఫల్ రాజా ఏఐఎస్పీ అందిస్తున్నారు.
రుద్రంగి' సినిమాలో ఆశిష్ గాంధీ యాక్షన్ ఆధారిత పాత్రలో కనిపించనుండగా.. రాబోయే యాక్షన్ డ్రామాలో జగపతి బాబు.. ఓ దుష్ట మనస్తత్వం గల క్రూరుడిగా అలరించనున్నారు. ఇక 'యమ దొంగ' ఫేమ్ మమతా మోహన్‌దాస్ ఈ చిత్రంలో జ్వాలాభాయ్ అనే కరుడుగట్టిన మహిళగా నటిస్తున్నారు. "మా చిత్రం నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. సామాజిక వ్యాఖ్యానంతో కూడిన పీరియాడిక్ డ్రామా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది" అని మేకర్స్ పేర్కొన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. తాను 'రుద్రంగి' సినిమాని పూర్తిగా ప్యాషన్‌తో చేశానని, రెమ్యునరేషన్ కోసం కాదని చెప్పారు. అణచివేత, తిరుగుబాటు కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు.
'పుష్ప 2'లో ఛాన్స్..
సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప 2' సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవలే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమా ప్రమోషన్స్ లో పాల్లొన్న జగపతిబాబు.. 'పుష్ప 2' లో నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది
Read Also : Yash: ఏడాదిగా ఖాళీగా ఉన్న ‘కేజీఎఫ్’ స్టార్ యష్ - త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాడట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial