అన్వేషించండి

Prabhas: ప్రభాస్‌కు మరోసారి సర్జరీ! - తిరగబడిన గాయం, విదేశాలకు 'డార్లింగ్'?

Prabhas Undergo Surgery: ప్రభాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్‌ చేసే ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న కల్కి సినిమా చిత్రీకరణకు కాస్తా బ్రేక్‌ పడేలా ఉందట.

Prabhas Undergo Surgery: మొన్నటి వరకు సలార్‌ మేనియా కనిపించింది.  మూవీ రిలీజ్‌ అయ్యి మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం 'కల్కి'. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్‌ అశ్విన్‌ విజన్‌ను తెరపై చూసేందుకు ఆడియన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని డిసప్పాయింట్‌ చేసే ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న కల్కి సినిమా చిత్రీకరణకు కాస్తా బ్రేక్‌ పడేలా ఉందట. దానికి కారణం ప్రభాస్‌ అని తెలుస్తోంది. కాగా ప్రభాస్‌ కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

అందుకే సలార్‌ ప్రమోషన్స్‌కి దూరం 

దీని కారణంగానే 'సలార్‌' మూవీ ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా కనిపించలేదు. ఒక్క రాజమౌళి ఇంటర్య్వూతో సరిపెట్టాడు. దీంతో 'సలార్‌' ప్రమోషన్స్‌లో ప్రభాస్‌ పెద్దగా కనిపించకపోవడంతో ఏమైందా అని అంతా ఆరా తీయగా ఓ వార్త బయటకు వినిపించింది. ప్రభాస్‌ మోకాలి సర్జరీ కోసం మరోసారి విదేశాలకు వెళ్లబోతున్నాడట. అయితే 'బాహుబలి' మూవీ షూటింగ్‌ సమయంలో యాక్షన్స్‌ సీన్స్‌ చేస్తుండగా ప్రభాస్‌కు ఈ మోకాలి నొప్పి సమస్య మొదలైంది. ఈ నొప్పితోనే 'సాహో', 'రాధేశ్యామ్‌', 'అదిపురుష్‌' సినిమా షూటింగ్స్‌ కంప్లీట్‌ చేశాడు. 'ఆదిపురుష్‌' అనంతరం ప్రభాస్‌కు ఈ సమస్య తీవ్రమైందట. మూవీ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ మోకాలి నొప్పితో బాధపడటం చూశాం. దీంతో 'ఆదిపురుష్‌' రిలీజ్‌ అవ్వగానే 'డార్లింగ్' యూరప్‌ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. అక్కడే నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ప్రభాస్‌.. బర్త్‌ డే వేడుక కూడా అక్కడే జరిగింది. 

మళ్లీ వాయిదా తప్పదా?

అనంతరం ఇండియాకు తిరిగి రాగానే సలార్‌, కల్కి 2829 AD షూటింగ్‌లో పాల్గొన్నాడు. అంతేకాదు మారుతి 'రాజా సాబ్‌' సినిమా షూటింగ్‌ను కూడా కంప్లీట్‌ చేశాడు. ఇలా నిరంతరాయంగా షూటింగ్‌లో పాల్గొనడంతో ప్రభాస్‌ మోకాలి నొప్పి మళ్లీ తిరగపడిందట. మళ్లీ సర్జరీ అవసరం చేయాలని వైద్యులు సూచించారని ఫిలిం దూనియాలో ఇన్‌సైడ్‌ టాక్‌. డాక్టర్స్‌ సూచన మేరకు ప్రభాస్‌ మళ్లీ విదేశాలకు వెళ్లనున్నారంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ. ప్రభాస్‌ మళ్లీ విదేశాలకు వెళ్లబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

మరి ఈ వార్తలపై ప్రభాస్‌ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ఒకవేళ అదే నిజమైతే కల్కి సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. సమ్మర్‌ కానుకగా కల్కిని మే 9న విడుదల చేస్తామని మూవీ టీం ఇప్పటికే ప్రకటన కూడా ఇచ్చింది. ఇప్పుడు డార్లింగ్‌ సర్జరీ అవసరమైతే మాత్రం మరోసారి కల్కి వాయిదా వేయక తప్పదు. ఎందుకంటే సర్జరీ తర్వాత ప్రభాస్‌ విశ్రాంతి తీసుకోవాలి.. అది ఎన్ని రోజులని చెప్పలేం.. కాబట్టి చెప్పిన తేదీకి కల్కి రాకపోవచ్చు. కాగా ఇప్పటికే సంక్రాంతి నుంచి సమ్మర్‌ వాయిదా పడిన ఈ మూవీ అనుకున్న తేదీ వస్తుందా? వాయిదా? పడుతుందా? చూడాలి.  

Also Read: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘గుంటూరు కారం‘, ఏంటీ షాకయ్యారా? ఇవిగో ప్రూఫ్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget