అన్వేషించండి

Nani-Srikanth Odela Movie: నాని, శ్రీకాంత్‌ ఓదేల 'దసరా 2'పై క్లారిటీ వచ్చేసింది!

Dasara Sequel: హీరో నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌ దసరా సీక్వెల్‌ వస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీపై అందరిలో పలు సందేహాలు ఉండగా.. తాజాగా వాటిపై క్లారిటీ వచ్చింది.

Nani-Srikanth Odela Dasara Sequel:'దసరా' తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది మార్చిలో రిలీజ్‌ అయిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. నాని కెరీర్‌లోనే దసరా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింది. అప్పటి హోమ్లీ హీరోగా ఉన్న నాని 'దసరా'(Dasara Movie)తో మాస్‌ హీరో అయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బిగ్గేస్ట్‌ హిట్‌ కొట్టడమే కాదు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సర్‌ప్రైజ్‌ చేసింది. ఎందుకంటే ఇది నానికి కొత్త జానర్, అంతేకాదు డైరెక్టర్‌ కూడా కొత్తవాడే. ఈ సినిమాతోనే శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.

డెబ్యూ చిత్రమే అయినా అనుభవం దర్శకుడిలా ఓదెలను తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఈ మూవీ వచ్చి ఏడాది అవుతున్న ఇంతవరకు శ్రీకాంత్‌ ఓదెల తన నెక్ట్స్‌ మూవీని ప్రకటించలేదు. దీంతో అతడి తదుపరి ప్రాజెక్ట్స్‌పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి. అతడు నెక్ట్స్‌ ఏ జానర్‌తో వస్తాడా? హీరో ఎవరా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో తాను మళ్లీ నానితోనే సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. దీంతో అంతా ఇది 'దసరా'కీ సీక్వెల్‌ (Dasara Sequel) అని ఫిక్స్‌ అయ్యారు. కానీ 'దసరా' ఫస్ట్‌ పార్ట్‌లో అంతా కన్‌క్లూడ్‌ చేసేశాడు దర్శకుడు. విలన్‌ చనిపోవడం, హీరోహీరోయిన్లు కూడా కలిసిపోయినట్టే చూపించాడు.

నానితో శ్రీకాంత్ ఓదెల రెండో సినిమా
దసరాకు సీక్వెల్?

Clarity On Dasara Sequel: మరి ఇంకా సీక్వెల్‌లో ఏం చూపిస్తారంటూ అందరిలో సందేహాలు మొదలయ్యాయి. దీంతో కొత్త నటీనటులు, లేదా అదే నటీనటులతో రెండో భాగం ఉంటుందని, పూర్తి కొత్త కథతో ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై క్లారిటీ లేకపోవడంతో అంతా డైలామాలో ఉన్నారు. ఈ క్రమంలో 'దసరా 2'పై తాజాగా క్లారిటీ వచ్చింది. శ్రీకాంత్‌ ఓదెల నెక్ట్స్‌ నానితోనే చేస్తున్న మాట నిజమే. కానీ, ఇది పూర్తిగా కొత్త కథ అట. ఇది 'దసరా'కు సీక్వెల్‌ కాదని సమాచారం. అసలు ముందు నుంచి దసరాకు సీక్వెల్‌ చేసే ఆలోచన లేదట శ్రీకాంత్‌ ఓదెలకు. అందుకే సినిమాలోనే మొత్తం కన్‌క్లూజన్‌ ఇచ్చేశాడట. నెక్ట్స్‌ నానితో చేస్తున్న రెండో సినిమా దసరాకు పూర్తి ఢిపరేంట్‌ అని సమాచారం.  ప్రస్తుతం నాని కోసం కొత్త స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడట శ్రీకాంత్‌ ఓదెల. కాగా ప్రస్తుతం నాని యాక్షన్‌ థ్రీల్లర్‌ 'సరిపోదా శనివారం' మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరపుకుంటున్న ఈ మూవీ ఆగష్ట్‌ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఆ తర్వాత నాని 'బలగం' డైరెక్టర్‌ వేణుతో మరో మూవీ కమిట్‌ అయ్యాడు. ఈ సినిమాకు 'ఎల్లమ్మా' ఫిక్స్‌ చేసినట్టు తెలిసిందే. 

Also Read: Ram Charan Birthday: రామ్‌ చరణ్‌ బర్త్‌డే - అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ స్పెషల్‌ విషెస్‌, అరుదైన వీడియో షేర్‌ చేసిన బన్నీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ లీడింగ్‌- 15కిపైగా రాష్ట్రాల్లో విజయం- వెనకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
World Travel Market: లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Embed widget