Copyrights In Cinema : సినిమా కాపీరైట్స్ మీద దర్శక, రచయితలు, నిర్మాతలకు అవగాహన కోసం - శనివారమే సదస్సు!
కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తారు. వాటి మీద రైట్స్ ఎవరికి ఉంటాయి? ఏ రైట్స్ ఎవరికి చెందుతాయి? ఈ అంశం మీద శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
సినిమా నిర్మాణం అనేది కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారం! ఓ ఐడియా కథగా పురుడు పోసుకోవడం నుంచి స్క్రిప్ట్ వర్క్, అక్కడి నుంచి ప్రొడక్షన్ వర్క్, ఆ తర్వాత రిలీజ్... ఒక్కటి ఏమిటి? థియేటర్లలో సినిమా విడుదల అయ్యే వరకు ఎన్నో వ్యయ ప్రయాసలు ఉంటాయి. సినిమా కోసం కొందరు ఆస్తులు తాకట్టు పెడతారు. మరికొందరు ప్రాణాలు పణంగా పెడతారు. మరి, అంత కష్టపడి తీసిన సినిమా మీద ఎవరికి ఏ హక్కులు ఉంటాయి? అసలు, సినిమాపై ఎన్ని రకాల హక్కులు ఉంటాయి? అవి ఎవరెవరికి చెందుతాయి?
సినిమా ద్వారా వచ్చే ఆదాయ మార్గాలు ఎన్ని?
సినిమా అంటే కేవలం థియేటర్లలో అమ్మే టికెట్స్ ద్వారా వచ్చే ఆదాయం ఒకటే కాదు! ఇంకా బోలెడు రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ కాకుండా డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మకం ద్వారా కొంత ఆదాయం వస్తుంది. ఆ రెండూ కాకుండా ఆడియో రైట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సినిమాల్లో కొన్ని బ్రాండ్స్ చూపించడం ద్వారా ఇన్ బిల్ట్ ప్రమోషన్స్ పరంగా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
సినిమాలపై నిర్మాతలకు ఏ విధమైన, ఎన్ని రకాల హక్కులు కలిగి ఉంటాయి? సినిమాకు సంబంధించిన పూర్తి ఆదాయ మార్గాలు ఏమిటి? ఇప్పుడు విక్రయించే కొన్ని రకాల హక్కులకు భవిష్యత్తులో పుట్టుకొచ్చే హక్కులు కూడా వర్తిస్తాయా? లేదా? గతంలో అమ్మిన సినిమాలపై దర్శక - రచయితలు, నిర్మాతలకు ఇంకా హక్కులు ఉంటాయా?
దర్శక - రచయితలు, నిర్మాతలకు అవగాహన కల్పించడం కోసం!
సినిమాలకు సంబంధించిన హక్కులపై సమగ్ర అవగాహన కల్పించడం కోసం... తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber Of Commerce) సౌజన్యంతో ప్రొడ్యూసర్ బజార్ డాట్ కామ్ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. 'IP Rights & Copyrights in cinema' అనే అంశంపై శనివారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు 'దిల్' రాజు (Dil Raju) అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు జరుగుతుందని తెలిపారు. ఇందులో నిర్మాతల, దర్శకుల, రచయితల సందేహాలను ఐపీ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) స్ట్రాటజిస్ట్, సుప్రీం కోర్టు లాయర్ భరత్, ప్రొడ్యూసర్ బజార్ వ్యవస్థాపకులు జి.కె. తిరునావుకరసు నివృత్తి చేస్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు కెఎల్ దామోదర ప్రసాద్, శరత్ కుమార్, దర్శకులు వీఎన్ ఆదిత్య తదితరులు పాల్గొంటారు.
Also Read : ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత... మాజీ భర్త గుర్తులు, జ్ఙాపకాలు వద్దని అనుకుంటోందా?
ఈ అవగాహన సదస్సులో పాల్గొని సినిమా 'ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్', 'కాపీ రైట్స్'కు సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగినవారు... సినిమాలకు సంబంధించిన పలు రకాల ఆదాయ మార్గాల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని కోరుకునేవారు... సుప్రియను ఫోన్ నెంబర్ 9176249267లో లేదా supriya@fipchain.com లో నేరుగా సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే అవగాహన సదస్సులోకి ప్రవేశం ఉంటుందని తెలిపారు.
Also Read : పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క - వాళ్లకు ఓ పాప కూడా, వైరల్ ఫోటోలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial