Samantha : ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత
అక్కినేని నాగ చైతన్య గుర్తులను తన ఒంటిపై ఉంచుకోవాలని సమంత అనుకోవడం లేదా? అంటే 'అవును' అని చెప్పాలి.
ఇప్పుడు సమంత (Samantha) జీవితంలో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) లేరు. ఆయన జీవితంలో ఆమె లేరు. వైవాహిక బంధం నుంచి వేరు పడినప్పుడు... తోడుగా మనిషి లేనప్పుడు... పేరు మాత్రం ఎందుకు అనుకున్నారో ఏమో!? తన ఇంటిపై చైతన్య పేరును సమంత చెరిపేశారు. ఎక్కడ? ఏమైంది? అని తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్ళాలి.
ఇప్పుడు 'చైతన్య' పేరు లేదు...
ఫొటోల్లో ఆ మార్పు గమనించారా?
తాను అనుకున్నది సమంత చెప్పేసే రకం! మనసులో ఏదీ దాచుకోరు. అది ప్రేమ అయినా సరే! కోపం అయినా సరే! బాధ అయినా సరే! ఆమెకు మొహమాటాలు అసలు లేవు. విడాకుల తర్వాత తనపై విమర్శలు రావడంతో సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చిన విషయం ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది. విడాకులు తీసుకోవడానికి ప్రేమలో ఉన్నప్పుడు... నాగ చైతన్యపై ప్రేమను సైతం అదే విధంగా వ్యక్తం చేసేవారు. తమ ప్రేమకు గుర్తుగా ఒంటిపై పచ్చబొట్టు (టాటూలు) కూడా వేయించుకున్నారు.
సమంత ఒంటిపై మూడు టాటూలు కనిపించేవి. చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమా 'ఏ మాయ చేసావే'కి గుర్తుగా మెడకి కొంచెం కిందకు... వీపు మీద 'YMC' అని ఓ టాటూ ఉంటుంది. మరొకటి మణికట్టు మీద ఉంటుంది! బాణం గుర్తు తరహాలో ఉండే ఆ టాటూ రోమన్ సింబల్ అట! డీకోడ్ చేస్తే మ్యారీడ్ డేట్ వస్తుందట! ఆ రెండూ పక్కన పెడితే... సమంత పక్కటెముకలు (రిబ్స్) మీద మరో టాటూ ఉంటుంది. అది ఇంకా స్పెషల్!
అక్కినేని నాగ చైతన్యను ఇంట్లో కుటుంబ సభ్యులు, పరిశ్రమలో స్నేహితులు ముద్దుగా 'చై' (Chay Akkineni) అని పిలుస్తారు. సమంత ఆ పేరును రిబ్స్ మీద టాటూగా వేయించుకున్నారు. ఇంతకు ముందు ఆ టాటూ కనిపించేలా ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. లేటెస్టుగా దుబాయ్ వెళ్లిన సమంత... పింక్ కలర్ శారీలో ఓ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అక్కడ ఫోటోలు దిగి పోస్ట్ చేశారు. అవి చూస్తే... రిబ్స్ మీద 'చై' పేరు లేదు. ఆ టాటూను తొలగించారు. ఇంతకు ముందు ఫొటోలు, లేటెస్ట్ ఫొటోలు చూస్తే ఆ మార్పు తెలుస్తుంది.
Also Read : దెబ్బకు శంకర్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు - చరణ్ ఫ్యాన్స్‌కు నో టెన్షన్!
View this post on Instagram
మళ్ళీ కలిసేది లేదని ఇలా చెప్పారా?
నాగ చైతన్య, సమంత మళ్ళీ కలవబోతున్నారని ఇటీవల ప్రచారం మొదలైంది. మాజీ దంపతులు ఇద్దరూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులను చూసి... మళ్ళీ కలుస్తున్నారని, ప్యాచప్ అవుతారని ఎవరికి వారు తమకు తోచింది రాస్తున్నారు. ఆ పుకార్లకు చెక్ పెట్టడానికి 'చై' టాటూ తొలగించిన ఫోటోలను సమంత షేర్ చేశారని ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. ఒంటి మీద చై టాటూ తొలగించిన సమంతకు మళ్ళీ ఒక్కటి అయ్యే ఉద్దేశం ఉంటుందా? అని తెలుగు సినిమా ఇండస్ట్రీలో జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read : బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial