అన్వేషించండి

Kannappa Movie: 'క‌న్న‌ప్ప‌'లో మ‌ధుబాల లుక్ చూశారా? ఫిదా అయిపోతారంతే!

Kannappa Movie: 'క‌న్న‌ప్ప' సినిమాలో మరో క్యారెక్ట‌ర్ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసింది టీమ్. ప్ర‌తి సోమ‌వారం ఒక అప్ డేట్ ఇస్తాం అంటూ గ‌తంలో విష్ణు ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు మ‌ధుబాల లుక్ రిలీజ్ చేశారు.

Kannappa Movie New Update: టాలీవుడ్ యాక్ట‌ర్, మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సినిమా 'క‌న్న‌ప్ప‌'. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎంతోమంది ప్ర‌ముఖ న‌టులు ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు న‌డుస్తున్నాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి టీజ‌ర్ ఇప్ప‌టికే రిలీజ్ చేశారు. అది అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే, సినిమా రిలీజ్ వ‌ర‌కు ప్ర‌తి సోమ‌వారం ఒక అప్ డేట్ ఇస్తామ‌ని విష్ణు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక ఈ సోమ‌వారం సినిమాలోని ఒక ప్రధాన క్యారెక్ట‌ర్‌ను ప‌రిచ‌యం చేశారు. సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల క్యారెక్ట‌ర్‌కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

ప‌న్నగ‌గా మ‌ధుబాల‌.. 

'క‌న్న‌ప్ప' సినిమాలో ఎంతోమంది ప్ర‌ముఖ న‌టులు ఉన్నారు. వాళ్ల‌లో ఒక‌రు సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల‌. ఆమె ఈ సినిమాలో ప‌న్నగ‌గా న‌టిస్తున్న‌ట్లు మూవీ టీమ్ ప్ర‌క‌టించింది. చెంచుల‌కు ఆమె మ‌హ‌రాణి అని అర్థం. ఇక ప‌న్నగ‌ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. మధుబాల ఒక ప‌వ‌ర్ ఫుల్ లేడీ గెట‌ప్‌లో వీర వణితాలా కనిపించారు. చేతిలో క‌త్తి ప‌ట్టుకుని చాలా గంభీరంగా ఉన్నారు.

చేప‌ట్టిన క‌త్తులు వాళ్ల విజ‌యాన్ని చెక్కుతాయి..!
అడ్డుపెట్టిన డాల‌లు శ‌త్రు దాడిని అడ్డుకుంటాయి..!  
మాతృస్వామ్య వ్య‌వ‌స్థ ఆన‌వాళ్లు.. 
నారీకోన మ‌హారాణి ప‌న్నగ‌.. 
ఆమె కుమార్తే వీర‌నారి నెమ‌లి, స‌దా యుద్ధానికి సిద్ధం..

అంటూ ఆమె గురించి వివ‌రించారు ఆ పోస్ట‌ర్‌లో.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kannappa The Movie (@kannappamovie)

100 కోట్లు.. 5 భాష‌ల్లో.. 

టాలీవుడ్ న‌టుడు మోహ‌న్ బాబు ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు రూ.100 కోట్లు ఖ‌ర్చుతో తీస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై సినిమా తెర‌కెక్కుతోంది. ‘మహాభారతం’ టీవీ సీరియల్‌ తెరకెక్కించిన ముఖేష్ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళీ, హిందీ భాష‌ల్లో సినిమా కానుంది. మొద‌టి నుంచి ఈ సినిమాపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా టీజ‌ర్ తో ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా సినిమా కావ‌డంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కి చెందిన చాలామంది ప్ర‌ముఖ న‌టులు ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న‌కు సంబంధించి టీజ‌ర్ లో కూడా ఒక చిన్న గ్లింప్స్ ఉంది. ప్ర‌భాస్ తో పాటు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు, మలయాళీ స్టార్ హీరో మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల శ‌ర‌త్ కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న లుక్ ని రిలీజ్ చేసి స‌ర్ ప్రైజ్ చేసింది 'క‌న్న‌ప్ప' టీమ్. కాగా.. సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఇప్ప‌టికి ప్ర‌క‌టించ‌లేదు. 

Also Read: అది చూడగానే దిమ్మ తిరిగిపోయింది, హీరోయిన్‌తో డ్యూయెట్ లేదు - ‘మహారాజా’పై పరుచూరి రివ్యూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Embed widget