అన్వేషించండి

Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry: ఇంటర్నెట్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఓర్రీ.. దాదాపు ప్రతీ బాలీవుడ్ పార్టీలో కనిపిస్తుంటాడు. అయితే ఆ పార్టీలలో కనిపించడానికి, ఫోటోలు దిగడానికి తను ఎంత ఛార్జ్ చేస్తాడో తాజాగా బయటపెట్టాడు.

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని ద్వారా తన సంపాదన లక్షల్లో ఉంటుందని తాజాగా ఓర్రీ ఒక షోలో బయటపెట్టాడు.

సినిమాల్లో నటించను..

తాజాగా భారతీ సింగ్, హర్ష్ లింబాచియా పోడ్కాస్ట్‌లో పాల్గొన్నాడు ఓర్రీ. అందులో తను చేసే పని గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు సినిమాలు, షోలలో కనిపించడం అస్సలు ఇష్టం లేదు. కష్టమైన పని చేయాలని ఎవరు కలలు కంటారు? ఎవరూ కనరు కదా. నాకు పని అస్సలు నచ్చదు. సినిమాల్లో, టీవీలో నటించడం చాలా పెద్ద పని. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో పని అనేది ఎప్పటికీ పూర్తికాదు. నీ పనిని ఇంటికి తీసుకెళ్తావు, నీ జీవితం మొత్తం పని చుట్టూనే తిరుగుతుంది. బయట నుండి చూసేవారికి ఇది ఈజీ అనిపిస్తుంది కానీ కాదు’’ అంటూ తను ఎప్పటికీ సినిమాల్లో తేల్చిచెప్పాడు ఓర్రీ.

అదే నా సంపాదన..

మరి ఏ పని చేయకుండా డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు అని అడగగా.. ‘‘నేను చీప్‌గా కనిపిస్తున్నానా? నన్ను ఒక్క ఫోటో అడిగితే రూ.25 లక్షలు అడుగుతాను. నా అంతట నేనే ఫోటో ఇస్తాను అంటే మాత్రం ఏం డబ్బులు తీసుకోను. మామూలుగా ఓర్రీ టచ్ కావాలంటే కూడా రూ.20 లక్షలు ఛార్జ్ చేస్తాను. ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీలో నాకంటూ ఒక స్పెషల్ టీమ్ ఉంది. నాకంటూ మనుషులు ఉన్నారు. నా పనిని చూసుకోవడానికి పదిమందికి పైగా మ్యానేజర్లు ఉన్నారు’’ అంటూ తన ఛార్జెస్ గురించి చెప్పి షాకిచ్చాడు ఓర్రీ. ఇది విన్న తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు ఓర్రీ టచ్ కోసం అంత డబ్బును ఖర్చుపెడుతున్నారా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

సంతోషెట్టడమే లక్ష్యం..

ఇంతకు ముందు కూడా పలు షోలలో పాల్గొన్న ఓర్రీ.. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సంతోషంగా ఉండడం, సంతోషాన్ని పంచడం మాత్రమే తన లక్ష్యమన్నాడు. తాను పార్టీలకు అటెండ్ అయ్యి, ఫోటోలు దిగడం వల్ల చాలామంది సంతోషపడతారని తెలిపాడు. ప్రస్తుతం అలా పార్టీలకు అటెండ్ అవ్వడం వల్లే తాను సంపాదిస్తున్నానని అన్నాడు. ఇక పెళ్లి లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్‌కు అటెండ్ అవ్వడం కోసం తాను రూ.15 లక్షల నుంచి 30 లక్షలు ఛార్జ్ చేస్తానని ఇప్పటికే ఒక సందర్భంలో బయటపెట్టాడు ఓర్రీ. ఇక బాలీవుడ్‌లో ఓర్రీకి ఉన్న డిమాండ్ చూస్తుంటే చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: 'నువ్వు కొట్టలేదు.. చంపేశావు' - క్రికెటర్‌గా జాన్వీ కపూర్‌, ఆకట్టుకుంటున్న 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' ట్రైలర్‌ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Sports Calender 2025 Update: చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
Embed widget