అన్వేషించండి

Indrani Trailer: విజువల్‌ వండర్‌గా ఆకట్టుకుంటున్న 'ఇంద్రాణి' ట్రైలర్‌ - వందేళ్ల తర్వాత టెక్నాలజీ ఎలా ఉండబోతుందో తెలుసా..

Indrani Trailer Out: యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్, అజయ్, శతాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం 'ఇంద్రాణి'. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Indrani Movie Telugu Official Trailer Out: యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్, అజయ్, శతాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం 'ఇంద్రాణి'. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో పాన్ ఇండియాగా ఈ సినిమాను తెరకెక్తెకించారు. జూన్ 14న తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఈ సినిమా విడుదల కానున్న ఈ సినిమాకు స్టీఫెన్ పల్లం ద‌ర్శ‌కత్వం వహించాడు.  వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్‌లు సహా నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌టైం ఇంద్రాణితో ఇండియన్‌ సినిమాకి సూపర్‌ ఉమెన్‌ని పరిచయం చేయబోతున్నాడు డైరెక్టర్‌ స్టీఫెన్‌. కాగా ఇప్పటికే ప్రచార పోస్టర్స్‌, టీజర్‌లతో మూవీ బజ్‌ క్రియేట్‌ చేశారు. ఈ క్రమంలో తాజాగా రిలీజైన ట్రైలర్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. 

ఇక ట్రైలర్‌ మొత్తం ఓ విజువల్‌ వండర్‌గా సాగింది. ఈ సినిమాతో డైరెక్టర్‌ ఆడియన్స్‌ని 2122 సంవత్సరానికి తీసుకువెళ్లబోతున్నాడు. నటుడు సాయి కుమార్‌ వాయిస్‌ ఓవర్‌తో సాగిన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. 'ఇండియన్ సూపర్ ఫోర్స్'గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్, అద్భుతమైన విజువల్స్ తో ప్రజెంట్ చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇంద్రాణి' ఓ విజువల్ వండర్. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మెస్మరైజింగా ఉంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్‌తో అలరించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ అన్ని కూడా టాప్ క్లాస్‌లో ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..'ఇంద్రాణి' ఒక ఎపిక్ లాంటి సినిమా అన్నారు. ఇందులో చాలా అద్భుతమైన కంటెంట్ ఉందని, టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుందన్నారు. మూవీలో లీడ్ రోల్‌తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశామన్నారు. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా ఉంటుందని, ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉందన్నారు. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ ఉండబోతుందో ఇందులో చూపించడం జరిగిందని, వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఈ సినిమాలో చూపించామన్నారు. ఖచ్చితంగా ఇంద్రాణి మూవీ అందరికీ నచ్చుతుందని, యానీయా ఇండియన్ సూపర్ విమన్‌గా అద్భుతంగా నటించిందన్నారు.

ఈ సినిమా తర్వాత ఆమెతో ప్రేమలో పడిపోతారంటూ చమత్కిరించారు. ఇంద్రాణి మాస్ మర్వెల్ అని, అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కంప్లీట్ ఎంటర్ టైనర్ సినిమా అని డైరెక్టర్‌ స్టిఫెన్ ‌అన్నారు. అనంతరం నటుడు కబీర్ సింగ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ స్టీఫెన్ కి హ్యాట్సప్ చెప్పాలి. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు. ఇండియాలో చాలా సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. కానీ ఇంద్రాణి ఫస్ట్ ఇండియన్ సూపర్ విమన్ సినిమా. ఇందులో సూపర్ విలన్ గా చేశాను. ఫ్యామిలీతో కలసి హాయిగా చూసే సినిమా ఇది. చాలా  యూనిక్ ఫిల్మ్ లో ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.     

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget