India's Biggest Superstar: ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? బాలీవుడ్ గరమ్ గరమ్... సందీప్ రెడ్డి వంగా రాజేసిన మంట!
Spirit Announcement Video Controversy: ప్రభాస్ బర్త్డేకు వాయిస్ టీజర్ విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. అందులో 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ప్రభాస్ అనడంపై బాలీవుడ్ మండిపడుతోంది.

Who Is India's Biggest Superstar: ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? - ఇప్పుడు ఇంటర్నెట్ అంతటినీ షేక్ చేస్తున్న ప్రశ్న ఇది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు కొంత మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న టాపిక్. దీనికి ముఖ్య కారణం సందీప్ రెడ్డి వంగా (Sundeep Reddy Vanga). ఆయన దర్శకత్వంలో భారతీయ బాక్స్ ఆఫీస్ బాహుబలి ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించనున్న 'స్పిరిట్' సినిమా బర్త్ డే సర్‌ప్రైజ్ వీడియో.
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్
Prabhas Sundeep Reddy Vanga Movie: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలయికలో 'స్పిరిట్' సినిమా (Spirit Movie) రూపొందుతోంది. ఆ సంగతి ఆడియన్స్ అందరికీ తెలుసు. హీరో పుట్టినరోజు సందర్భంగా వీడియో టీజర్ విడుదల చేశారు సందీప్. అందులో విజువల్స్ లేవు. కేవలం ఆడియో ఒక్కటే వినిపిస్తుంది. అయితే... ఆ టీజర్‌లో 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్' అని పేర్కొన్నారు. అది హిందీ జనాలు కొందరికి నచ్చడం లేదు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉండగా ప్రభాస్‌ను పట్టుకుని 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అంటారేంటి? అంటూ మండిపడ్డారు కొందరు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలు 'సాహో', 'రాధే శ్యామ్' ఫ్లాప్ అవ్వగా... 'ఆదిపురుష్' డిజాస్టర్ అయ్యిందని - 'సలార్', 'కల్కి 2898 ఏడీ' హిట్ అయ్యాయని అంటున్నారు. ఆ రెండు విజయాలు చూసి అతడిని 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అనడం కరెక్ట్ కాదంటున్నారు.
మా బాద్‌షా షారూఖ్ ఉన్నారుగా!
'పఠాన్', 'జవాన్', 'డంకి'... ఒక్కో సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని, అందుకని షారుఖ్ ఖాన్ ఒక్కరే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ & బాలీవుడ్ జనాలు. మరి కొందరు అయితే 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ట్యాగ్ చూసి ముంబై జనాలు కొందరికి నిద్ర పట్టదని కామెంట్ చేస్తున్నారు.
Also Read: మేనేజర్ మహేంద్ర మాకొద్దు... ఎందుకీ పబ్లిక్ పోస్టులు... స్టార్స్ వెనుక ఏం జరిగింది?
'స్పిరిట్' వాయిస్ టీజర్ ఎలా ఉంది? అనేది పక్కన పెడితే... 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' ఎవరు? అనే ప్రశ్న ఎక్కువ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ట్రోల్స్ - మీమ్స్ వార్ వచ్చేలా చేసింది. ఈ ఒక్క టీజర్ ఇండియాను షేక్ చేసింది. బాలీవుడ్ విమర్శల పట్ల సందీప్ రెడ్డి వంగా అసలు కేర్ చేయరు. ఆ సంగతి అందరికీ తెలుసు. 'బాహుబలి' తర్వాత ఫ్లాప్ సినిమాలతోనూ వందల కోట్లు వసూలు చేసిన క్రెడిట్ ప్రభాస్ సొంతం. ఆ ట్రాక్ రికార్డ్ మరొక హీరోకి లేదు. హిందీలోనూ బడా బడా స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయితే రెండొందల కోట్ల కలెక్షన్స్ కూడా రావడం లేదు. అందువల్ల, మన బాహుబలిని 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అనడంలో తప్పేం లేదు.
Also Read: బైసన్ రివ్యూ: కబడ్డీ, కుల వివక్ష నేపథ్యంలో విక్రమ్ కుమారుడి సినిమా - హిట్టా? ఫట్టా?





















