Indian 2 First Single: 'భారతీయుడు 2' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది - గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పవర్ఫుల్ సాంగ్
Indian 2 Fisrt Single: కమల్ హాసన్ భారతీయుడు నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది మూవీ టీం. శౌర అంటూ సాగే ఈ పాట గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక విజువల్స్ అయితే కేక పుట్టిస్తున్నాయి.
Bharateeyudu 2 First Lyrical song Released: విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'(Indian 2 Movie). స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలై 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది మూవీ టీం. ఈ నేపథ్యంలో నేడు భారతీయుడు 2 నుంచి ఫస్ట్ సింగిల్ పేరు సాంగ్ రిలీజ్ చేసింది. శౌర అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ తాజాగా విడుదలు చేశారు. ఈ లిరికల్ సాంగ్ కమల్ గుర్రం స్వారీ చేస్తూ కనిపించారు.ఈ క్రమంలో చూపించిన విజువల్స్ మూవీపై బజ్ క్రేయేట్ చేస్తున్నాయి. శౌరా... అగనిత సేనా సమా అంటూ పవర్ఫుల్‌గా సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్‌లో నిలిచింది.
కాగా అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌తో పాటు ప్రముఖ రెడ్ జాయింట్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది ఈ సినిమాను. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో సుద్ధాల అశోక్ తేజ రాసిన ఈ పాటను రితేష్ జీ రావ్, శ్రుతికా సముద్రాల ఆలపించారు. ఇక ఈ ఇండియన్ 2ను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూలై 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఇక జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చెన్నై ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు సమక్షంలో భారతీయుడు 2 ఆడియో లాంచ్ జరగనుంది. రెండు దశాబ్ధాల క్రితం అంటే 1996లో కమల్ మాసన్, శంకర్ కాంబినేషన్ విడుదలై భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. అప్పట్లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లుతో ఇండియన్ బాక్సాఫీస్‌నే షేక్ చేసింది. దాదాపు రూ. 50 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఇండియన్ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసింది. టాలీవుడ్ చందమామా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నట్టు సమాచారం.
Also Read: షారుక్ ఖాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిన కింగ్ ఖాన్
సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఇక ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్ జరుపుకుంటు ఫైనల్‌గా విడుదలకు రెడీ అయ్యింది. తొలి దశలోనే ఈ మూవీ వివాదాలతో కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ మూవీ షూటింగ్‌ని నిలిపివేద్దామనుకున్న డైరెక్టర్ శంకర్‌తో మేకర్స్ పట్టుబట్టి కంటిన్యూ చెప్పించారు. ఈ క్రమంలో వారి మధ్య వివాదాలు కూడా తలెత్తాయి. ఇక మొత్తానికి రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీతో పాటు ఇండియన్ 2 షూటింగ్ జరుపుకుంటూ స్లో స్లోగా పూర్తి చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్ మూవీ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్‌గా విడుదలైన గ్లింప్స్‌కు అన్ని భాషల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.