Shah Rukh Khan: షారుక్ ఖాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిన కింగ్ ఖాన్
Shah Rukh Khan Hospitalised: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకు గురైన ఆయన తాజాగా ఆహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన చికిత్స అందిస్తున్నారు.
Shah Rukh Khan Joins in Hospital: బాలీవుడ్ కింగ్ ఖాన్, బాద్ షా షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో పాలయ్యారు. అనారోగ్యం కారణంగా నేడు ఆహ్మదాబాద్‌లోని కేడీ హస్పిటల్లో చేరినట్టు సమాచారం. డిహైడ్రేషన్ కారణంగా ఆయన అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఇక ఆయన ఆరోగ్యంకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం షారుక్ ఐపీఎల్ బిజీలో ఉన్నారు. కాగా కోల్కత్తా నైట్ రైడర్స్ ప్రాంజైజ్ యాజమాని అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా మ్యాచ్‌లకు అటెండ్ అవుతున్నారు. ఈక్రమంలో ఆయన హీట్ స్ట్రోక్ తగిలినట్టు తెలుస్తోంది. దాంతో డిహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైనట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చివరిగా జవాన్ మూవీతో ప్రేక్షకులను అలరించారు.
#WATCH | Gujarat: Actor Juhi Chawla and her husband Jay Mehta leave from KD Hospital, in Ahmedabad.
— ANI (@ANI) May 22, 2024
Actor Shah Rukh Khan has been admitted to the hospital. Details awaited. pic.twitter.com/osyGyAmwp2
ఈ చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన షారుక్ ఇంతవరకు మరో కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయలేదు. ఇకపోతే బాలీవుడ్ నటి జూహి చావ్లా తాజాగా ఆస్పత్రిలో షారుక్ ను పరామర్శించినట్టు సమాచారం. తన భర్త జై మెహతాతో కలిసి ఆహ్మాదాబ్ కేడీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా షారుక్ కి కలిసి తిరిగి వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే హీట్ స్ట్రోక్ తో ఆహ్మాదాబాద్ ఆస్పత్రిలో చేరిన షారుక్ ఖాన్ చికిత్స అనంతరం కాసేపటి క్రితమే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన టీం పేర్కొంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Due to heat stroke dehydration, but sir is fine now and he’s been discharged, nothing to worry.
— Sudhir Kothari (@sudhirkothari03) May 22, 2024
Love You @iamsrk ❤️#ShahRukhKhan https://t.co/5k5S5z1ixD