అన్వేషించండి

Indian 2 Movie X Twitter Review: 'భారతీయుడు 2' ఆడియన్స్ రివ్యూ: కమల్ కుమ్మేశాడు, విజువల్స్ సూపర్ - సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?

Bharateeyudu 2 Movie X Twitter Review: కమల్ హాసన్, శంకర్ 28 ఏళ్లకు ఇండియన్ / భారతీయుడు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి, ఆడియన్స్ టాక్ ఎలా ఉందో చూడండి.

Kamal Haasan's Bharateeyudu 2 Twitter Review Telugu: భారతీయుడిగా లోక నాయకుడు కమల్ హాసన్ థియేటర్లలోకి వచ్చాడు. సేనాపతిగా సందడి షురూ చేశారు. తనను 28 సంవత్సరాల క్రితం 'భారతీయుడు'గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన శంకర్ దర్శకత్వంలో సీక్వెల్ చేశారు. తమిళంలో 'ఇండియన్ 2', తెలుగులో 'భారతీయుడు 2', హిందీలో 'హిందూస్థానీ 2'గా థియేటర్లలో భారీ ఎత్తున ఇవాళ సినిమా విడుదలైంది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేసిన చిత్రమిది. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి, సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? చూడండి. 

స్టన్నింగ్ విజువల్స్... గ్రేట్ ప్రొడక్షన్ వేల్యూస్!
దర్శకుడు శంకర్ పేరు చెబితే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది గ్రాండ్ విజువల్స్. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు. ఇంకా సాంగ్స్! 'భారతీయుడు 2' సినిమాలో కూడా స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయని ఓవర్సీస్ నుంచి ఫస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. దర్శకుడికి ఖర్చుకు వెనుకాడని లైకా ప్రొడక్షన్స్ యాడ్ అవ్వడంతో ప్రతి ఫ్రేములో ఆ రిచ్, లావిష్ లుక్ కనిపించిందని ఆడియన్స్ అంటున్నారు.

Also Read: 'ఇండియన్ 2' ఫస్ట్ రివ్యూ... ఆడియన్స్‌లో బజ్ తక్కువే కానీ సూపర్ హిట్ రిపోర్ట్!

కమల్ హాసన్ కుమ్మేశారు... ఆయన పెర్ఫార్మన్స్ ఫైర్!
సేనాపతిగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరోసారి కుమ్మేశారని ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సేనాపతి రోల్ చేసి పాతికేళ్లు దాటినా సరే ఆయన లోనుంచి ఆ క్యారెక్టర్ వెళ్లలేదని చెబుతున్నారు. ఆయన నటనలో ఫైర్ కనిపించిందని చెబుతున్నారు. లాంగ్ హెయిర్ లుక్ అంతగా సెట్ కాలేదని, కానీ కమల్ నటన మాత్రం అదుర్స్ అని అంటున్నారు.

Also Read25 ఏళ్ల అమ్మాయితో 56 ఏళ్ల రవితేజ రొమాన్స్ - మిస్టర్ బచ్చన్ సాంగ్ మీద ట్రోల్స్, గట్టిగా ఇచ్చి పారేసిన దర్శకుడు హరీష్ శంకర్


వివేక్ సార్... మిమ్మల్ని మిస్ అవుతున్నాం!
'భారతీయుడు 2'లో దివంగత నటుడు వివేక్ ఓ పాత్ర చేశారు. ఆయన్ను ఓ నెటిజన్ గుర్తు చేసుకున్నాడు. అతడిని మిస్ అవుతున్నామని పేర్కొన్నాడు. గత ఏడాది మరణించిన తమిళ నటుడు మనోబాల సైతం ఈ సినిమాలో నటించారు. 

బుక్ మై షోలో జోరు... రికార్డ్ ఓపెనింగ్స్ గ్యారంటీ!
'భారతీయుడు 2'కు ముందు కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'. అది బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు సాధించింది. ఇక, వెయ్యి కోట్ల 'కల్కి 2898 ఏడీ'లో సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో తన నటనతో కమల్ ఔరా అనిపించారు. ఇప్పుడు ఈ 'భారతీయుడు 2'తో మరోసారి భారీ ఓపెనింగ్స్ సాధించడానికి రెడీ అవుతున్నారు. బుక్ మై షోలో సినిమా ట్రెండ్, జోరు చూస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం అని తెలుస్తోంది. 

అనిరుధ్ రవిచందర్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదా?
'భారతీయుడు 2' పాటలు విడుదలైనప్పటి నుంచి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ 'భారతీయుడు' సంగీతంతో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. సినిమా నేపథ్య సంగీతం విషయంలోనూ ఆ కంపేరిజన్ కనబడుతోంది. బహుశా అందువల్లే ఏమో అనిరుధ్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదనే మాట వినబడుతోంది. పూర్తి రివ్యూ కోసం ఏబీపీ దేశం వెబ్‌సైట్ చూస్తూ ఉండండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget