Husharu Re Release Date - 'హుషారు' రీ రిలీజ్: థియేటర్లలోకి మళ్ళీ యూత్‌ఫుల్ కామెడీ సినిమా - అడ్వాన్స్ బుకింగ్స్‌కు అంతా రెడీ
Husharu Re Release Ticket Bookings: జూలైలో చాలా సినిమాలు రీ రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి అందులో మొదట థియేటర్లలోకి వచ్చే సినిమా 'హుషారు'. ఈ రోజు సాయంత్రం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతాయి.

'హుషారు'... సినిమా కంటే ఇందులో పాటలు చాలా పాపులర్. సిద్ శ్రీరామ్ సూపర్ డూపర్ హిట్ చార్ట్ బస్టర్ 'ఉండిపోరాదే' పాట ఈ సినిమాలోనిదే. ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ మీద తీసిన 'పిచాక్', 'ఓ పిల్ల కబోమా' పాటల కూడా ఈ సినిమాలోనివే. వీటి ప్రస్తావన ఎందుకంటే... మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి కనుక.
జూలై 5న 'హుషారు' రీ రిలీజ్!
Husharu movie re release date: శ్రీ హర్ష కొనుగంటే దర్శకుడిగా పరిచయం అయిన సినిమా 'హుషారు'. ఇందులో తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ, అభినవ్ మేడిశెట్టి హీరోలుగా నటించారు. రాహుల్ రామకృష్ణ ఒక కీలక పాత్ర చేశారు. ప్రియా వడ్లమాని, దక్షా నగార్కర్, రమ్య పసుపులేటి, హేమల్ ఇంగ్లే హీరోయిన్లుగా నటించారు.
లక్కీ మీడియా పతాకం మీద బెక్కం వేణుగోపాల్, రియాజ్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 14, 2018లో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. జూలై నెలలో రీ రిలీజ్ అయ్యేందుకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో అన్నిటికంటే ముందుగా థియేటర్లలోకి వచ్చే సినిమా 'హుషారు'. ఈ నెల 5వ తేదీన... అంటే శనివారం ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది.
Also Read: రామ్ చరణ్ హెల్ప్ చేయలేదు... ఫ్లాప్ తర్వాత ఒక్క ఫోన్ రాలేదు - నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు
The crazy gang is back
— Yaswanth Powerstar🦅 (@YaswanthPowers5) July 1, 2025
Husharu Re-releasing on July 5th, 2025
#HusharuReRelease #Husharu #HusharuMovie #Kaboom #undiporaadhe pic.twitter.com/8JQqMqMWQJ
Husharu Re Release Bookings Open Date and Time: జూన్ 1వ తేదీ... మంగళవారం సాయంత్రం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. ఈ వారం నితిన్ 'తమ్ముడు' థియేటర్లలోకి వస్తుంది. అలాగే 'బొమ్మరిల్లు' సిద్ధార్థ నటించిన తమిళ సినిమా 'త్రిబుల్ బెడ్ రూమ్' (3 BHK) కూడా డబ్బింగ్ అవుతోంది. ఆ రెండూ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అది కాకుండా 'బిగ్ బాస్' ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన 'సోలో బాయ్' కూడా జూలై 4న రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. అదొక్కటే యూత్ ఫుల్ సినిమా. దానికి తోడుగా ఇప్పుడు 'హుషారు' ఉంటుంది.





















