Game Changer: రామ్ చరణ్ హెల్ప్ చేయలేదు... ఫ్లాప్ తర్వాత ఒక్క ఫోన్ రాలేదు - నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు
'గేమ్ చేంజర్' బాక్స్ ఆఫీస్ రిజల్ట్ గురించి, ఫ్లాప్ గురించి మరోసారి డిస్కషన్ మొదలైంది. 'దిల్' రాజు సోదరుడు నిర్మాత శిరీష్ ఆ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతికి విడుదలైన 'గేమ్ చేంజర్' (Game Changer) డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనగా... వాటిని తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ మరొకసారి డిస్కషన్ పాయింట్ అయింది. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ ఆ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్టసీకి ఒక్క ఫోన్ కూడా చేయలేదు!
''గేమ్ చేంజర్' విడుదల తర్వాత మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్ళీ హోప్స్ వచ్చాయి. నాలుగు రోజుల్లో మా జీవితం మారింది. అదే లేకపోతే మా పరిస్థితి ఏమిటో చెప్పండి? మేము ఎవరికీ చెప్పుకోవాలి??'' అని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శిరీష్ వ్యాఖ్యానించారు.
భారీ నిర్మాణ వ్యయంతో 'గేమ్ చేంజర్' తీశారు. పాన్ ఇండియా రిలీజ్ చేశారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విజయం తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో భారీ విజయం సాధిస్తుందని అందరూ ఆశించారు. అయితే... డిజాస్టర్ అయ్యింది. 'గేమ్ చేంజర్' విడుదలైన నాలుగు రోజులకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల పైచిలుకు వసూళ్ల సాధించడంతో నిర్మాతలు గట్టెక్కారు. అయితే ఫ్లాప్ తర్వాత తమకు హీరో నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదని శిరీష్ వ్యాఖ్యానించారు.
Also Read: రామ్ చరణ్ హీరోగా మరో సినిమా తీసేందుకు 'దిల్' రాజు ప్రయత్నాలు
Game Changer Tho Maa Brathuku Ipoyindhi Anukunnam But Sankranthi Vastunnam Tho Hopes Vachayi.
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) June 30, 2025
GC Loss Hero, Director Evaru Pattinchukoledhu - Sirish Garu. pic.twitter.com/Faw7ka52WQ
''గేమ్ చేంజర్' ఫ్లాప్ అయ్యింది హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం కర్టసీకి ఒక ఫోన్ కూడా చేయలేదు'' అని శిరీష్ చెప్పారు. రామ్ చరణ్ ఫోన్ చేసి అడుగుతారు కదా? అని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ప్రశ్నించగా... ''ఎవరు మాకు ఫోన్ చేయలేదు'' అని శిరీష్ స్పష్టం చేశారు. తమకు ఇష్టమై సినిమా చేశామని, పోగొట్టుకున్నామని ఆయన తెలిపారు. అంతే తప్ప హీరోని నిందించలేదు. భవిష్యత్తులో రామ్ చరణ్ హీరోగా మరో సినిమా చేసే అవకాశం ఉందన్నారు. అలాగే, రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇవ్వమని అడగలేదని (రామ్ చరణ్ ను) చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆ స్థాయికి ఇంకా దిగజార లేదన్నారు. ఈ సంస్థలో నితిన్ హీరోగా నిర్మించిన 'తమ్ముడు' సినిమా ఈ నెల 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే.





















