అన్వేషించండి

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

సోమవారం జరిగిన హిట్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమాను నిర్మించిన హీరో నాని మాట్లాడారు.

‘హిట్ 3’లో హీరో ఎవరో ‘హిట్ 2’ చూస్తే అర్థం అవుతుందని సినిమాను నిర్మించిన హీరో నాని అన్నారు. హిట్ ఫ్రాంచైజీలో మొత్తంగా ఏడు సినిమాలు ఉంటాయని తెలిపారు. ఏడో సినిమాలో అందరు హీరోలు కలుస్తారని చెప్పారు. ‘హిట్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...

‘ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్. శ్రీవల్లి, రమా రాజమౌళి ఈ ఫంక్షన్‌కు వస్తే మా అమ్మ, పిన్ని వచ్చినట్లు ఉంటుంది. మీ ఇద్దర్నీ చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల అయ్యాక ఎలా ఉందో మీరు చూసి నాకు చెప్పండి. ఇది ఒక గ్రిప్పింగ్ సినిమా. మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నాం.’

‘రాజమౌళి గారికి చాలా థ్యాంక్స్. ప్రపంచం మొత్తం తిరిగి ఇవాళే వచ్చారు. దిగిన వెంటనే ఈ ఫంక్షన్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది. వారాహి సాయి సినిమాల తర్వాత నా సినిమాల ఫంక్షన్లకే రాజమౌళి వస్తారు. ఇది ఆయనకు కూడా సొంత నిర్మాణ సంస్థ లాంటిదే. ‘అ’, ‘హిట్ 1’లకి వచ్చారు. ఇప్పుడు ‘హిట్ 2’కి కూడా వచ్చారు. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని లేదు. కానీ ఇబ్బంది పెడుతున్నాను.’

‘ఈ మధ్యే సూట్ వేసుకుని రెడ్ కార్పెట్ మీద చూశాను. ఆ స్టైల్, ఆ ఆటిట్యూడ్, ఆ లుక్ చాలా బాగున్నాయి. కార్తికేయ చాలా అందంగా ఉంటాడు. హీరోల పక్కన నించున్నా అందంగా కనబడతాడు. కానీ మీ పక్కన మాత్రం అస్సలు కనిపించలేదు. దేశమంతా రాజమౌళి సినిమాలో హీరో ఎవరు అని ఎదురు చూస్తారు. కానీ నేను మాత్రం ఆ ఫొటో చూశాక రాజమౌళి ఎప్పుడు హీరో అవుతారా అని ఎదురు చూస్తున్నా. మీరు జేమ్స్‌బాండ్‌లా ఉన్నారని మెసేజ్ పెడితే, నేను ఇయాన్ ఫ్లెమింగ్ (జేమ్స్‌బాండ్ రచయత) లానే ఉంటా అని ఆయన రిప్లై ఇచ్చారు. మీ తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తున్నాం.’

‘ఈ టీం అందరికీ పేరుపేరునా థ్యాంక్స్. సుహాస్ నన్ను చాలా ఇష్టపడతాడు. తను హీరో అయినా ఎప్పుడు వాల్ పోస్టర్ నుంచి ఫోన్ వెళ్లినా చిన్న రోల్ అయినా చేస్తాడు. తనకు కూడా థ్యాంక్స్. శేష్ చాలా టెర్రిఫిక్ యాక్టర్. శైలేష్ దర్శకుడు అవ్వకముందు ఒక సైంటిస్ట్. రీసెర్చ్ ఎక్కువ చేస్తాడు. హిట్ లాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీకి రీసెర్చ్ చాలా అవసరం. తన రీసెర్చ్ టాలెంట్ ఈ సినిమాకి చాలా పనికొచ్చింది.’

‘హిట్ 3, 4, 5, 6, 7 కూడా ఉంటాయి. హిట్ 7లో అందరు హీరోలను కలుపుతానని చెప్పాడు. నేను ప్రొడ్యూసర్‌గా కంటే కూడా ఒక ప్రేక్షకుడిగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. హిట్ 3లో హీరో ఎవరో చెప్పమని శేష్ నాకు చెప్తున్నాడు. కానీ దానికి పెద్ద టైం లేదు. హిట్ 2 చూసేటప్పుడు హిట్ 3 హీరో ఎవరో తెలిసిపోతుంది.’ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Andhra Pradesh: పులివెందుల యువరైతు సంతోషం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
IND VS NZ Live Score: భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
భార‌త్  స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయ‌స్, హార్దిక్.. ఫైఫ‌ర్ తో రాణించిన హెన్రీ
Anantapur Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
Meenakshi Chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్
ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్
Embed widget