Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీపై హైకోర్టు ఆగ్రహం
రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూవీ టీజర్‌లోని డైలాగులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిర్మాతకు నోటీసులు జారీ చేసింది.
రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ చిక్కుల్లో పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అనుమతి లేకుండా టీజర్‌ను ఎలా విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ టీజర్‌లో ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి టీజర్ల ద్వారా సమాచానికి ఎలాంటి సందేశం అదిస్తున్నారంటూ మండిపడింది.
ఏం జరిగింది?
‘టైగర్ నాగేశ్వరావు’ మూవీ టీజర్ ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలైంది. దీనికి నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఆ టీజర్‌లోని కొన్ని డైలాగులు ఎరుకుల సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయంటూ పాల్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. టీజర్‌ను పరిశీలించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధనార్జనే ధ్యేయంగా సినిమాలు నిర్మించకూడదని, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని ధర్మాసనం హితవు పలికింది.
నిర్మాతకు నోటీసులు
ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 27కు వాయిదా వేస్తూ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. CBFC ఛైర్‌పర్శన్‌ను ఇందులో ప్రతివాదిగా చేర్చాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషాసాయిల ధర్మసనం పిటిషనర్‌కు సూచించింది. మరి ఈ కేసుపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ మూవీని అక్టోబరు 20న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. సెన్సార్ బోర్డు ఏమైనా మార్పులు సూచిస్తే రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్
Also Read : చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఆర్.మది ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సంభాషణల రచయిత : శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.
విజయదశమి కానుకగా అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల కానుంది. ఈ సినిమా కంటే ఒక్క రోజు ముందు (అక్టోబర్ 19న) గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి' కూడా విడుదల కానుంది. ఆ సినిమాలో కాజల్ కథానాయిక. శ్రీ లీల కీలక పాత్రధారి. అలాగే... తమిళ స్టార్ హీరో విజయ్, 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న 'లియో' కూడా అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది. కొన్ని రోజుల క్రితం 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao) వాయిదా పడుతుందని వార్తలు రాగా... వాటిని చిత్ర బృందం ఖండించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial