అన్వేషించండి

Revanth Reddy: కండోమ్‌లు పట్టుకొని ప్రచారం చేశా, ఒక సీఎం చెప్తేనే నాకు బాధ్యత గుర్తుకు రాదు: హీరో సిద్దార్థ్

Bharateeyudu 2 Latest News: సైబర్ నేరాలు, డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన కోసం హీరోలు, నటీనటులు కూడా బాధ్యత తీసుకోవాలని ఇటీవల రేవంత్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.

Actor Siddharth on Revanth Reddy: నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. రిపోర్టర్లు ప్రశ్నలు అడిగే సమయంలో ఓ విలేకరి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ లాంటి అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హీరోలు, నటీనటులు కూడా బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. అలా చేసిన హీరోల సినిమాలకు తాము ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తామని రేవంత్ చెప్పారు.

దీనిపై స్పందించాలని విలేకరి భారతీయుడు 2 టీమ్‌ను అడగ్గా.. సిద్ధార్థ్ స్పందించారు. తాను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసని అన్నారు. ‘‘తెలుగు సినిమాలో తొలిసారిగా నేనే కండోమ్ చేతిలో పట్టుకొని దీన్ని వాడాలని ప్రభుత్వం తరపున ప్రచారం చేశాను. అప్పట్లో నేను నా ముఖంతో స్వయంగా కండోమ్ పట్టుకొని ప్రచారం కల్పించిన ఫోటోలు అన్ని రకాల ఫ్లెక్సీలపై ఉండేవి. సురక్షిత లైంగిక సంబంధాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నేను 2005 నుంచి 2011 వరకూ ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం సురక్షిత లైంగికతపై అవగాహన కోసం ఎక్కడ బిల్ బోర్డ్స్ ఉన్నా.. దానిపై కండోమ్ పట్టుకున్న నేనే ఉండేవాడిని. ఎందుకంటే అది నా బాధ్యత. 

ఒక చీఫ్ మినిస్టర్ చెప్తే ఆ బాధ్యత నాకు రాదు. ఒక యాక్టర్‌కు ముందు నుంచి ఇలాంటి బాధ్యత ఉందా అంటే నేను నో కామెంట్స్ అని చెప్తాను. ప్రతి నటుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. మా పరిధిలో ఉన్న మేరకు మేం ప్రభుత్వాలకి సాయం చేస్తాం. సీఎంలు ఏం అడిగినా చేయడానికి మేం రెడీనే. నువ్వు ఇలా చేస్తేనే మేం ఆ సహకారం అందిస్తాం.. అని సీఎం చెప్పడం కరెక్టు కాదు’’ అని సిద్ధార్థ్ సమాధానం ఇచ్చారు.

విలేకరి ఈ ప్రశ్న అడిగినప్పుడు వేదికపై కమల్ హాసన్, డైరెక్టర్ ఎన్ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. వారి తరపున సిద్ధార్థ్ సమాధానం చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Balan The Boy: తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా? మినిమమ్ కేర్ తీసుకోరా బాలన్?
Salim Kumar: విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్
విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Athiradi OTT : అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్
అతిరథి ఓటీటీ రిలీజ్ - యూత్, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ డోంట్ మిస్

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget