అన్వేషించండి

Raj Tarun : సినిమాల్లోనే హీరో బయట జీరో- చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటరే లేదు- రాజ్‌తరుణ్‌ పేరు చెప్పకుండానే యువతి ఆరోపణలు

Raj Tarun And Samyukta : వివాదాలను కూడా తన సినిమా ప్రమోషన్స్‌కు వాడేస్తున్నారు హీరో రాజ్‌తరుణ్. కొత్తగా రాబోయే కొత్త సినిమా కోసం కొత్తగా ప్రమోషన్ మొదలు పెట్టింది టీం

Bhale Unnade Cinema Promotion: రాజ్‌తరుణ్ చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటర్ లేదని సంచలన వ్యాఖ్యలు చేస్తూ సంయుక్త అనే యువతి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పటికే లావణ్య వివాదంలో చిక్కుకున్న రాజ్‌తరుణ్‌ అనేక విమర్శలు పాలవుతున్నారు. ఇప్పుడు మరో యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోతోంది. 

మొహాన్ని పూర్తిగా స్కార్ఫ్‌తో కప్పేసిన యువతి కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ... ఈ మధ్య వివాదాల్లో చిక్కుకున్న హీరో ఇవన్నీ  చేశాడంటే నమ్మకం కుదరడం లేదని చెప్పుకొచ్చింది. ఎక్కడా రాజ్‌తరుణ్ పేరు చెప్పకుండానే మేటర్ వీక్ అని ప్రచారం చేస్తోంది. తన ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్నాడని ఓ ముద్దు ముచ్చట ఏమీ లేదని చెప్పుకొచ్చింది. రాజ్‌తరుణ్ చూటడానికి బాగానే ఉంటాడు కానీ ఆయన వద్ద మేటరే లేదని చెప్పింది. త్వరలోనే తన ఫ్రెండ్‌ యూఎస్ నుంచి రానుందని పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన్ని మీ ముందు నిలబెడతానంటూ చెప్పుకొచ్చింది. 

ఇప్పటికే 30 దాటినా పెళ్లి చేసుకోలేదని... 40 వచ్చినా కూడా పెళ్లి ఊసే ఎత్తడని చెప్పుకొచ్చింది. మేటర్ లేదనే విషయం ఆయనకీ తెలుసు అంది. తను డేటింగ్‌లో ఉండే అమ్మాయి.. ఎవరెవరినో పిలుచుకున్నా పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉంటారని తెలిపింది. 

ఇదంతా కూడా కొత్తగా రాబోయే సినిమా "భలే ఉన్నాడే"కు సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగా చేసిందే. తన చుట్టూ అల్లుకున్న వివాదాలను కూడా ఈసారి సినిమా ప్రమోషన్‌కు వాడేయాలని చూస్తున్నారు రాజ్‌తరుణ్‌. రాజ్ తరుణ్ హీరోగా, మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటున్న 'భలే ఉన్నాడే' చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రమోషన్‌లో  భాగంగా ఇలా సంయుక్త పేరుతో వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మాట్లాడిన యువతి ఏం చెప్పారంటే..." లాస్ట్‌ వన్‌మంత్‌ నుంచి ఓ హీరో గురించి చాలా విషయాలు వింటున్నాం న్యూస్‌లో. నిజం చెప్పాలంటే అసలు ఆయన దగ్గర మేటరే లేదండీ. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఓ వన్‌ ఇయర్‌ నుంచి నా ఫ్రెండ్‌ ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారండీ. వాళ్లిద్దరు కలిసి ఉండటం ఏమో కానీ, ఆ పిల్ల రోజూ నాకు ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ ఒకే దగ్గర పడుకుంటారంటే... ఈయన మాత్రం పక్కకు తిరిగి పడుకుంటాడ. ఈ అమ్మాయి దగ్గరకు వెళ్లినా సరే దూరం వెళ్లిపోతుంటాడంట. ఓ ముద్దు లేదూ ముచ్చటా లేదని ఏడుస్తూనే ఉంటుంది.

అదేదో ఆడియో కాల్‌లో విన్నానండీ నేను... ఆ అమ్మాయి వాడిని తీసుకురా వీడిని తీసుకురా అని చెప్తా ఉంటుంది. ఈ అబ్బాయి పక్కనే ఉన్నా ఆ అమ్మాయి వాళ్లను పిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండీ. 27 ఏళ్లకు పెళ్లి చేసుకుంటానన్నాడు... ఇప్పుడు 30 వచ్చాయి అయినా పెళ్లి చేసుకోలేదు. మరో పదేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోడు. అలా ఉన్నాడే ఇలా ఉన్నాడే అని సినిమాలు బాగానే చేసుకుంటాడు. మనిషి చూడటానికి బాగానే ఉంటాడు. ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో. ఆగస్టు 19న మా ఫ్రెండ్ యూఎస్‌ నుంచి వస్తుంది. విత్ ప్రూఫ్స్‌తో మీకు అన్నీ చూపించి మాట్లాడతాను. 

రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ దర్శకుడు. మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా వస్తున్న చిత్రం కోసం ఇలా కొత్తగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. 

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

Also Read: వేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్ - సూర్య సినిమాకు పోటీగా

 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget