Karthikeya 2 Movie: ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్, వెనక్కి వెళ్లక తప్పలేదు
యువ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' ముందుగా అనుకున్న ప్రకారం జూలై 22న విడుదల కావడం లేదు. వాయిదా పడింది. అందుకని, ప్రేక్షకులకు సారీ చెప్పారు.
![Karthikeya 2 Movie: ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్, వెనక్కి వెళ్లక తప్పలేదు Hero Nikhil Siddharth apologies to audience as his latest movie Karthikeya 2 release postponed from July 22nd to August first week Karthikeya 2 Movie: ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్, వెనక్కి వెళ్లక తప్పలేదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/12/86b1ab3c405b0e12a6d129ec3635b98b1657595823_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) ప్రేక్షకులకు సారీ చెప్పారు. ఎందుకంటే... దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో హిట్ సినిమా 'కార్తికేయ'కు సీక్వెల్‌గా రూపొందిన 'కార్తికేయ 2' ముందుగా అనుకున్న ప్రకారం జూలై 22న విడుదల కావడం లేదు. వెనక్కి వెళ్ళింది. (karthikeya 2 release postponed)
ఆగస్టు తొలి వారంలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు నిఖిల్ తెలిపారు. యూకేలో ప్రీమియర్ షో టికెట్స్ బుక్ చేసుకున్న ప్రేక్షకులను ఆయన క్షమాపణలు కోరారు. అయితే... వాయిదాకు గల కారణాలను నిఖిల్ చెప్పలేదు.
But sorry.. the movie is not releasing on July22nd.. but In August 1st week 🥹
— Nikhil Siddhartha (@actor_Nikhil) July 11, 2022
Apologies to the Amazing ppl who booked tickets for the premiere show.. will get it refunded 🙏🏽 https://t.co/Uzi5pIs16r
Nannu Nenu Adiga Lyrical Song - Karthikeya 2: సినిమా వాయిదా పడిన సంగతి పక్కన పెడితే... ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు 'కార్తికేయ 2'లో తొలి పాట 'నన్ను నేను అడిగా'ను విడుదల చేయనున్నారు. నిఖిల్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పై ఈ పాటను తెరకెక్కించారు.
'కార్తికేయ 2' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read : పేషెంట్ బాడీకి నా ఫేస్ అతికించారు - యూట్యూబ్ థంబ్‌నైల్స్‌పై విక్రమ్ రియాక్షన్
ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాల భైరవ.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)