అన్వేషించండి

Actor Nani Comments On OG: 'ఓజీ' పై నాని కామెంట్స్ - ప్రభాస్ విషయంలో అన‌వ‌స‌రంగా కొంత‌మందిని హైలైట్ చేస్తున్నారు

Nani Comments On OG: ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న 'ఓజీ' సినిమా కోసం ఆయ‌న ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే, ఆయన ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు.. హీరో నాని కూడా ఆ సినిమా కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నార‌ట‌.

Actor Nani Comments On OG: హీరో నాని.. 'స‌రిపోదా శ‌నివారం' సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ఆగ‌స్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్స్ లో బిజీగా ఉన్నాడు నాని. అయితే, ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఉన్న నాని మ‌రో సినిమా గురించి మాట్లాడారు. అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న 'ఓజీ' సినిమా గురించి. ఆయ‌న ఆ సినిమా కోసం ఆతృత‌గా వెయిట్ చేస్తున్నార‌ట‌. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నాను అని అన్నారు నాని. అంతేకాకుండా.. ప్ర‌భాస్ పై బాలీవుడ్ క‌మెడియ‌న్ చేసిన కామెంట్స్ పై కూడా స్పందించారు నాని. అస‌లు ఏమ‌న్నారంటే? 

మీ లాగే పిచ్చిగా ఎదురుచూస్తున్నాను.. 

స‌రిపోదా శ‌నివారం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో నాని ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఆ ప్రెస్ మీట్ మొద‌ల‌య్యే ముందు నాని ప్రొడ్యూస‌ర్ దాన‌య్య‌ను ఓజీ సిసినిమా గురించి అడిగారు. దానిపై రిపోర్టర్ ప్ర‌శ్నించ‌గా.. నాని ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. దాన‌య్య గారిని సినిమాపై ట్రిగ‌ర్ చేశారు ఎందుక‌ని? అని అడిగితే.. "నేను కూడా 'ఓజీ' కోసం ఎదురుచూస్తున్నాను. ఆయ‌న్ని ట్రిగ్గ‌ర్ చేయ‌లేదు అడిగాను. అప్ డేట్ కోసం అంతే. నేను సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు కూడా ఆ పిచ్చి ఉంది. మీరంతా ఎంత‌లా ఎదురుచూస్తున్నారో నేను కూడా 'ఓజీ' కోసం అంత‌లా ఎదురుచూస్తున్నాను. నాకు దాన‌య్య గారిని ఇప్పుడు అడిగే ఛాన్స్ వ‌చ్చింది కాబ‌ట్టి అడిగాను" అని చెప్పారు నాని. 

ప్ర‌భాస్ పై క‌మెడియ‌న్ కామెంట్స్.. నాని ఏమ‌న్నారంటే?

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మీద చేసిన అభ్యంతరకర కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. క‌ల్కీ 2898 ఏడి లో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ ను తలపించిందన్నారు. మేకర్స్ అతడిని ఎందుకు అలా చిత్రీకరించారో అర్థం కావట్లేదన్నారు. దీనిపై నాని స్పందించారు. ఆ కామెంట్స్ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అన‌వ‌స‌ర‌మైన ప‌బ్లిసిటీ ఇవ్వొద‌ని అన్నారు నాని. "మీరు చెప్తున్న వ్య‌క్తికి లైఫ్ లో బిగెస్ట్ ప‌బ్లిసిటీ ఇప్పుడు జ‌రిగింద‌ని అనుకుంటున్నాను. అన‌వ‌స‌ర‌మైన విష‌యాన్ని మీరు ప‌బ్లిసిటీ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ విషయాన్ని వ‌దిలేయ‌డం మంచిది" అన్నారు నాని. 

ఇక ఇదే అంశంపై ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కూడా స్పందించారు. "ఎవ‌రో ఏదో మాట్లాడుతున్నారు దాన్ని మ‌నం ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. మీరే చెప్తున్నారు క‌దా సౌత్ టాప్ లో ఉంది అని. ఉందిగా.. ప్ర‌పంచం మొత్తం తెలుసు ఆ విష‌యం. ఎవ‌రో ఏదో అన్నార‌ని దాన్ని ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు న‌న్నే చూడండి.. నాపైనేరాళ్లు ప‌డుతూ ఉంటాయి. ఎందుకు ప‌డ‌తాయి. పండ్లు ఉన్నాయి కాబ‌ట్టే ప‌డ‌తాయి. ఇది కూడా అంతే.. ప్ర‌భాస్ ని అంటేనే క‌దా వాళ్లు ఫేమ‌స్ అయ్యేది" అని దిల్ రాజు అన్నారు.

నాచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా 'సరిపోదా శనివారంస ఈ సినిమాలో ఎస్. జె సూర్య కీ రోల్ ప్లే చేశారు. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బార్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సినిమాని. జేక్స్ బీజాయ్ సంగీతం అందించారు. ఆగ‌స్టు 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్, ట్రైల‌ర్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. 

Also Read: జోకర్ కాదు, సక్సెస్ వెనుక స్ట్రాంగ్ పిల్లర్ - అర్షద్ వార్సీ కామెంట్స్‌పై డీజే టిల్లు ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABPతిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Airtel Vs Jio: ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Embed widget