Thalaivar 171: 'తలైవర్ 171' నుండి ఆసక్తికర అప్డేట్ - అలాంటి పాత్రలో రజినీకాంత్!
Thalaivar 171: లోకేశ్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘తలైవర్ 171’పై ప్రేక్షకుల్లో ఇప్పుడే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ నుండి ఆసక్తికర రూమర్ బయటికొచ్చింది.
Thalaivar 171 Update: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తన కెరీర్‌లోని 171వ చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి లోకేశ్ కనకరాజ్‌ను ఎంపిక చేశాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో లోకేశ్ కనకరాజ్‌కు క్రేజ్ మామూలుగా లేదు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక రజినీకాంత్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి అప్పుడే ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ మూవీలో రజినీ పాత్ర గురించి పలు రూమర్స్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
అతిపెద్ద హిట్స్‌తో..
2023 అనేది సూపర్ స్టార్ రజినీకాంత్‌కు, దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు మర్చిపోలేని సంవత్సరంగా ముద్రపడిపోయింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీ నటించిన ‘జైలర్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ఇక విజయ్‌తో కలిసి లోకేశ్ చేసిన ‘లియో’ కూడా 2023లో కోలీవుడ్‌లోని అతిపెద్ద హిట్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. అందుకే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా అది హిట్టే అని చాలావరకు ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక తలైవర్ 171 ఫస్ట్ లుక్ చూస్తుంటే మరోసారి రజినీని మాస్ లుక్‌లో చూడవచ్చని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అసలు తలైవర్ 171లో రజినీ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గోల్డ్ స్మగ్లింగ్..
లోకేశ్ కనకరాజ్ ఫేవరెట్ జోనర్ క్రైమ్ డ్రామా. క్రైమ్, డ్రగ్స్ లేకుండా లోకేశ్ సినిమానే తెరకెక్కించలేడు అంటూ కోలీవుడ్ ప్రేక్షకులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తలైవర్ 171 కూడా అదే తోవకు చెందినది అని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో రజినీకాంత్ ఒక మాఫియా డాన్‌గా కనిపించనున్నట్టు సమాచారం. మరోసారి తనకు కలిసొచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించనున్నాడట లోకేశ్. సింగపూర్, దుబాయ్, అమెరికా లాంటి ఫారిన్ దేశాల నుండి ఇండియాకు గోల్డ్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అనే కథపై తలైవర్ 171 సాగుతుందని తెలుస్తోంది.
నెగిటివ్ షేడ్స్ కూడా..
తలైవర్ 171లో రజినీకాంత్ మాఫీయా డాన్‌గా కనిపించనున్నారు కాబట్టి తన పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగిపోయింది. గత కొన్నేళ్లుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రజినీ కనిపించలేదు. కానీ ఆయన అలాంటి పాత్ర చేస్తే చూడాలని ఫ్యాన్స్ మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తలైవర్ 171కు సంబంధించిన ఈ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు. 2024 జూన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే వచ్చే ఏడాదిలో ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నాడు.