అన్వేషించండి

Bharateeyudu 2 Day 3 Collections: ‘భారతీయుడు 2’ - యావరేజ్ టాక్‌తోనే అంత కలెక్ట్ చేసిందా?

Bharateeyudu 2 Collections: శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ యావరేజ్ టాక్‌తో మొదలయినా కూడా కలెక్షన్స్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Bharateeyudu 2 Box Office Collections: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’.. చాలా తక్కువ హైప్‌తో థియేటర్లలో విడుదలయ్యింది. పైగా ఈ సినిమాపై భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు. దీంతో అసలు ‘భారతీయుడు 2’ కలెక్షన్స్‌ విషయంలో వెనకబడుతుందేమో అనుకున్నారు. మామూలుగా ఒక ప్యాన్ ఇండియా మూవీ విడుదలవ్వగానే మొదటి వారంలోనే ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తుంది. కానీ ‘భారతీయుడు 2’ మాత్రం తన కలెక్షన్స్‌ను కాస్త స్లోగా స్టార్ట్ చేసినా మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి పర్వాలేదనిపించే కలెక్షన్స్‌ను సాధించడం విశేషం.

ఆశ్చర్యపరుస్తున్న కలెక్షన్స్..

మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ‘భారతీయుడు 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విడుదలయిన మొదటి ఆదివారం ఈ మూవీ.. రూ.15.1 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. దీంతో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూ.58.9 కోట్లకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ‘భారతీయుడు 2’.. రూ.109.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాయని సమాచారం. దీంతో ఈ కలెక్షన్స్ వివరాలు చూస్తున్న ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అతి తక్కువ హైప్‌తో విడుదలయిన మూవీ ఈ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించడం మామూలు విషయం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యావరేజ్ టాక్..

ఓపెనింగ్ రోజు ‘భారతీయుడు 2’ రూ.25.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కానీ వీకెండ్ ప్రారంభమయ్యే సమయానికి ఈ కలెక్షన్స్ కాస్త తగ్గాయి. రెండోరోజు కేవలం రూ.18.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే దక్కించుకుంది ఈ సినిమా. ఇక మూడో రోజు రూ.15.35 కలెక్షన్స్‌ను అందుకుంది. అలా ‘భారతీయుడు 2’కు ఇప్పటివరకు రూ.58.9 కోట్ల నెట్ కలెక్షన్స్ దక్కాయి. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.109.15 కోట్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ మూవీ. యావరేజ్ టాక్‌తో అయినా మంచి కలెక్షన్స్ సాధించిన సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అందులో ‘భారతీయుడు 2’ కూడా యాడ్ అయ్యింది.

హిందీలో తక్కువే..

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’.. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలయ్యింది. ఈ మూడు భాషల్లో సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ కూడా చేశారు. అందుకే హిందీలో ఈ మూవీ కలెక్షన్స్ కాస్త తగ్గినా తెలుగు, తమిళంలో మాత్రం పోటాపోటీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటివరకు తమిళంలో ‘భారతీయుడు 2’కు రూ.41.2 కోట్ల కలెక్షన్స్ రాగా తెలుగులో మాత్రం రూ.13.9 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. హిందీలో మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా కేవలం రూ.3.8 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. కానీ అక్షయ్ కుమార్ నటించిన ‘సర్ఫిరా’కు పోటీగా ‘ఇండియన్ 2’ హిందీ బాక్సాఫీస్‌ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది.

Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న కమల్‌ హాసన్‌ 'భారతీయుడు' - మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget