అన్వేషించండి

Kalki Collections: కలెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న 'క‌ల్కీ 2898' - వామ్మో రెండు రోజుల్లోనే అన్ని కోట్లా!

Kalki Collections: 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా దూసుకుపోతుంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ప్ర‌పంచం మొత్తం సినిమాని ఆద‌రిస్తున్నారు అంటూ వైజ‌యంతి మూవీస్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

Kalki 2898 AD 2Days Gross Collections: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌త్వంలో, ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా 'క‌ల్కీ 2898 ఏడీ'. జూన్ 27న విడుదల అయిన ఈ సినిమా భారీ స్థాయిలో క‌లెక్ష‌న్ల రాబ‌డుతోంది. క‌లెక్ష‌న్ల సునామీ కొన‌సాగుతూనే ఉంది. సినిమాకి హిట్ టాక్ రావ‌డంతో ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్లు సూప‌ర్ గా ఉన్నాయి అంటూ వైజ‌యంతి మూవీస్ ఇన్ స్టాలో ట్వీట్ చేసింది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత క‌లెక్ష‌న్ సాధించింది? ఒక‌సారి చూద్దాం. 

గ్రాస్ క‌లెక్ష‌న్ ఎంతంటే? 

'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా వారం మ‌ధ్య‌లో రిలీజ్ అయ్యింది. అయిన‌ప్ప‌టికీ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా చూసేందుకు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు భారీగానే వ‌చ్చారు. దీంతో మొద‌టి రోజు గ్రాస్ క‌లెక్ష‌న్లు రూ.191.5 కోట్లు దాటింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాస్ కలెక్ష‌న్లు రూ.298.5 కోట్లు దాటిన్లు సినిమా టీమ్ ప్ర‌క‌టించింది. "ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి మీ ప్రేమ‌ను కురిపిస్తున్నారు" అంటూ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌డుస్తున్న ఒక పోస్ట‌ర్ ని షేర్ చేసింది వైజ‌యంతి మూవీస్ టీమ్. ఇదిలా ఉంటే.. శ‌నివారం, ఆదివారం వీకెండ్ కావ‌డంతో క‌లెక్ష‌న్ ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. క‌చ్చితంగా వెయ్యి కోట్ల క‌బ్ల్ లో చేరుతుంది రాసిపెట్టుకోండి అంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

రికార్డుల‌పై స్వ‌ప్న ద‌త్ కామెంట్.. 

ఇదిలా ఉంటే.. 'క‌ల్కీ' సినిమా రికార్డుల‌పై ఆ సినిమా ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌రైన స్వ‌ప్న ద‌త్ కామెంట్ చేశారు. అంద‌రూ త‌న‌ని రికార్డుల గురించి ఫోన్లు చేసి అడుగుతున్నార‌ని, తాము రికార్డుల కోసం సినిమా తియ్య‌లేద‌ని, అలా అడుగుతుంటే న‌వ్వొస్తుంది అంటూ కామెంట్ చేశారు ఆమె. ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డులు సృష్టించిన వారు ఎవ్వ‌రూ రికార్డులు కోసం సినిమాలు తియ్య‌లేద‌ని, సినిమా మీద ప్రేమతోనే తీశార‌ని అన్నారు. తాము కూడా అంతే అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. 

ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు.. 

'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాపై ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఎక్స్ ద్వారా త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, డైరెక్ట‌ర్ ఆర్జీవి, విజ‌య దేవ‌ర‌కొండ‌, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దిత‌రులు నాగ్ అశ్విన్ ని పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ వాడిన బుజ్జిని చూసేందుకు సెల‌బ్రిటీలు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ‌ల‌త‌, నాగ్ అశ్విన్ త‌దిల‌రులు బుజ్జితో క‌లిసి దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. 

సెకెండ్ పార్ట్ కోసం.. 

ఇప్పుడు ఎవ‌రు చూసినా 'క‌ల్కీ' సినిమా సెకెండ్ పార్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. సెకెండ్ పార్ట్ దీన్ని మించి ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పార్ట్ లో క‌మ‌ల్ హాస‌న్ కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే క‌నిపిస్తారు. దీంతో ఆయ‌న పాత్ర సెకెండ్ పార్ట్ లో అద్భుతంగా ఉండ‌బోతుంది అంటూ అంచ‌నా వేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాకుండా విజ‌య దేవ‌ర‌కొండకి కూడా సెకండ్ పార్ట్ లో అర్జునుడిగా ఎక్కువసేపు క‌నిపించే ఛాన్స్ ఉంటుందేమో అనే వార్త కూడా వినిపిస్తుంది. చూడాలి మ‌రి సెకెండ్ పార్ట్ ని ఇంకా ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతారో.   

Also Read: 'క‌ల్కీ 2898 AD'పై ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌లు - సూప‌ర్ స్టార్ ఏమ‌న్నారంటే?

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget