News
News
X

ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...

ఇప్పుడు తాను ప్రేమలో లేనని, సింగిల్ అని హీరోయిన్ హెబ్బా పటేల్ చెబుతున్నారు. ఒకప్పుడు డేటింగ్ చేశానని అన్నారు. లవ్, డేటింగ్ లైఫ్ గురించి... తనకు ఎటువంటి వాడు కావాలనే దాని గురించి ఆవిడ ఏమన్నారంటే?

FOLLOW US: 

హెబ్బా పటేల్ (Hebah Patel) పేరు వింటే తెలుగు ప్రేక్షకుల ముందుగా గుర్తుకు వచ్చేది 'కుమారి 21ఎఫ్'! ఇప్పుడు ఆ కుమారి సింగిలా? మింగిలా? ఆమె జీవితంలో  ప్రేమికుడు ఎవరైనా ఉన్నారా? లేదా? అంటే... ఇప్పుడు తాను ఒంటరే అని హెబ్బా పటేల్ చెబుతున్నారు. అంటే... ఇంతకు ముందు మింగిల్ అయ్యారట. తర్వాత బ్రేకప్ అయ్యారట. లేటెస్టుగా లవ్ లైఫ్ గురించి హెబ్బా పటేల్ ఓపెన్ అయ్యారు.

ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ చేశారు హెబ్బా పటేల్. '24 కిసెస్' వంటి సినిమాల్లో ఆమె బోల్ పెర్ఫార్మన్స్ హాట్ టాపిక్ అయ్యింది. మరి, రియల్ లైఫ్ సంగతి ఏంటి? అని హెబ్బాను అడిగితే... ''చాలా రోజుల నుంచి నేను సింగిల్ గా ఉంటున్నాను'' అని సమాధానం ఇచ్చారు. అంటే... అంతకు ముందు ప్రేమలో ఉన్నారా? డేటింగ్ చేశారా? అని సందేహం వచ్చింది కదూ! డానికి కూడా ఆమె సమాధానం ఇచ్చారు.
 
''నేను డేటింగ్ చేశా. అయితే, వాళ్ళు ఎవరూ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కాదు. నిజం చెప్పాలంటే... నా ఫస్ట్ సినిమా విడుదలకు ముందు బ్రేకప్ అయ్యింది'' అని హెబ్బా పటేల్ వివరించారు. సో... ఆమె డేటింగ్ చేసింది ముంబైలో ఉన్న కుర్రాడు కావచ్చు. 

'కుమారి 21ఎఫ్' సినిమా హెబ్బా పటేల్ తొలి సినిమా అని తెలుగులో చాలా మంది అనుకుంటారు. ఆ సినిమా కంటే ముందు రాహుల్ రవీంద్రన్ సరసన 'అలా ఎలా?' ఆమె నటించారు. అయితే... ఆ సినిమా కంటే 'కుమారి 21ఎఫ్' ఎక్కువ పేరు తీసుకు వచ్చింది. తొలి సినిమా విడుదల తర్వాత బిజీ కావడంతో బ్రేకప్ గురించి ఎక్కువ ఆలోచించ లేదట.

హెబ్బా పటేల్ తనకు ఎటువంటి వాడు కావాలనేది కూడా వివరించారు. ''నేను చాటర్ బాక్స్. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. అందుకని, తక్కువ మాట్లాడే అబ్బాయి కావాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు'' అని ఆమె చెప్పారు. 

Also Read : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

సినిమాలకు వస్తే... ప్రస్తుతం హెబ్బా పటేల్ 'ఓదెల రైల్వే స్టేషన్' (Odela Railway Station Movie), 'తెలిసినవాళ్లు' (Hebah Patel Telisinavaallu Movie), 'వల్లన్' సినిమాల్లో నటిస్తున్నారు. '24 కిసెస్' మీద చాలా ఆశలు పెట్టుకున్నానని, ఆ సినిమా ఆడకపోవడంతో ఎటువంటి సినిమాలు చేయాలనేది విశ్లేషించుకుని ఇప్పుడు సినిమాలు చేస్తున్నాని ఆవిడ చెప్పుకొచ్చారు.

హీరోయిన్లు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తే గ్లామరస్ గా కనిపించే అవకాశం ఉండదనే అభిప్రాయం తప్పని హెబ్బా పటేల్ పేర్కొన్నారు. పెర్ఫార్మన్స్, గ్లామర్... రెండూ బ్యాలెన్స్ చేసుకోవచ్చని ఆమె అంటున్నారు. ఇప్పుడు తాను చేస్తున్న సినిమాల్లో అభినయానికి, అందానికి ఆస్కారం ఉందని హెబ్బా పటేల్ తెలిపారు. 

Also Read : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Published at : 14 Aug 2022 08:04 AM (IST) Tags: Hebah Patel Hebah Patel Love Life Hebah Patel Break Up Hebah Patel Latest News Hebah Patel On Future Husband

సంబంధిత కథనాలు

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Tamannaah Bhatia: సింగిల్‌గా కాదు, ఏడాది పాటు పార్టనర్‌తో ఉంటా - ‘డేటింగ్’పై తమన్నా వ్యాఖ్యలు

Tamannaah Bhatia: సింగిల్‌గా కాదు, ఏడాది పాటు పార్టనర్‌తో ఉంటా - ‘డేటింగ్’పై తమన్నా వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల